New Farm Laws: కేంద్రంపై రైతుల ఉద్యమానికి ఏడాది పూర్తి

కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ కొత్త చట్టాలపై చేపట్టిన రైతు ఉద్యమం ఏడాది పూర్తి చేసుకుంది. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన కార్యక్రమాలు, భారీ బహిరంగ సభలతో దీక్షలు నిర్వహించారు.

New Farm Laws: కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ కొత్త చట్టాలపై చేపట్టిన రైతు ఉద్యమం ఏడాది పూర్తి చేసుకుంది. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన కార్యక్రమాలు, భారీ బహిరంగ సభలతో దీక్షలు నిర్వహించారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి భారీగా ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఢిల్లీ-యూపీ సరిహద్దు ఘాజిపూర్ వద్ద రైతు నిరసన కార్యక్రమంలో రాకేష్ టికాయత్, హన్నన్ మొల్లా సహా సంయుక్త కిసాన్ మోర్చా నేతలు పాల్గొనున్నారు. ఉద్యమంలో 700 మందికి పైగా అమరులైన రైతులకు నివాళులర్పిస్తారు.

దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల్లో భారీ మహాపంచాయత్‌ల నిర్వహణకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది.

………………………………. ఫ్రస్ట్రేషన్ పీక్స్.. అంపైర్‌పై కోపంతో కళ్లజోడు విసిరికొట్టిన రాహుల్ చాహర్

నవంబర్ 19న చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించినప్పటికీ.. పార్లమెంట్‌లో చట్టాల రద్దు ఆమోదం పొందే వరకు ఆందోళన విరమించేది లేదని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు