Rahul Chahar: ఫ్రస్ట్రేషన్ పీక్స్.. అంపైర్‌పై కోపంతో కళ్లజోడు విసిరికొట్టిన రాహుల్ చాహర్

భారత గడ్డపై టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. దక్షిణాఫ్రికా వేదికగా మరో భారత జట్టు టెస్ట్ ఫార్మాట్ ఆడుతుంది. దక్షిణాఫ్రికా ఏ జట్టుతో భారత్ ఏ...

Rahul Chahar: ఫ్రస్ట్రేషన్ పీక్స్.. అంపైర్‌పై కోపంతో కళ్లజోడు విసిరికొట్టిన రాహుల్ చాహర్

Rahul Chahar

Rahul Chahar: భారత గడ్డపై టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. దక్షిణాఫ్రికా వేదికగా మరో భారత జట్టు టెస్ట్ ఫార్మాట్ ఆడుతుంది. దక్షిణాఫ్రికా ఏ జట్టుతో భారత్ ఏ జట్టు తలపడుతోంది. గెలుపు కోసం ఇండియన్ ఏ టీం కాస్త ఎక్కువగానే కష్టపడాల్సి వస్తుంది. ఒత్తిడి మధ్య జరుగుతున్న మ్యాచ్ లో రాహుల్ చాహర్ ఫ్రస్ట్రేట్ అయ్యాడు.

ఫస్ట్ ఇన్నింగ్స్ సమయంలో ఇండియన్ బౌలర్లు తీవ్రంగా కష్టపడ్డారు. అయినప్పటికీ ప్రత్యర్థి జట్టు తొలి ఇన్నింగ్స్ లో 509పరుగులు సాధించింది.

సెకండ్ ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో రాహుల్ చాహర్ 25వ ఓవర్ బౌలింగ్ వేస్తున్నాడు. సినెతెంబా ఖీషీలె ప్యాడ్స్ కు బాల్ తగిలింది. బౌలర్ గా ఉన్న రాహుల్ వెంటనే అప్పీల్ చేశాడు. కానీ, అంపైర్ నిర్ణయం సంతృప్తిగా అనిపించలేదు. వెంటనే కళ్లద్దాలు తీసి నేలకు విసిరికొట్టాడు. కాసేపటి వరకూ వాడీవేడిగా చర్చ జరిగింది. ఆ తర్వాత కిందపడ్డ కళ్లజోడు పెట్టుకుని ఓవర్ పూర్తి చేశాడు చాహర్.

…………………………….. : నిండు కుండలా మారిన తుంగభద్రా నది

ఇండియన్ ప్లేయర్లకు ఈ సిరీస్ చాలా కీలకం. డిసెంబర్ 17నుంచి సఫారీ జట్లతో టీమిండియా ఆడాల్సి ఉంది. పృథ్వీ షా, సీనియర్ బ్యాటర్ హనుమ విహారీ, యంగ్ పేస్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్ లు టోర్నమెంట్ లో భాగం కానున్నారు. మొత్తం మూడు టెస్టులు జరగాల్సి ఉండగా ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్ లు మంచి పోటీ ఇస్తారని అనుకుంటున్నారు.