Tungabhadra Flood Water : నిండు కుండలా మారిన తుంగభద్రా నది
కర్నూలు జిల్లా మంత్రాలయంలో తుంగభద్ర నది ప్రమాద స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీతీర ప్రాంతాల్లో ఉండే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాఘవేంద్రస్వామి దర్శనా

Tungabhadra Mantralayam
Tungabhadra Flood Water : కర్నూలు జిల్లా మంత్రాలయంలో తుంగభద్ర నది ప్రమాద స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీతీర ప్రాంతాల్లో ఉండే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాఘవేంద్రస్వామి దర్శనానికి వచ్చే భక్తులను నదీ స్నానాలకు వెళ్లకూడదని తెలియజేస్తున్నారు.
రాత్రి కురిసిన వానకు తుంగభద్ర నది నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు తుంగభద్ర డ్యాం కు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు 1లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
నదీ తీర గ్రామాల్లో ఉన్న ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. మంత్రాలయంలో దాదాపు 1లక్ష 20 వేలు క్యూసెక్కులు ప్రవహిస్తోంది. శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనానికి వచ్చే భక్తులు నదిలో స్నానాలకు వెళ్ళకుండా బారికేడ్లు అమర్చారు. భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు గంగమ్మ దేవాలయం జలదిగ్బందంలో ఉంది.