వాహనదారులు ఇక తప్పించుకోలేరు.. జనవరి 1 నుంచి తప్పనిసరి!

  • Publish Date - November 8, 2020 / 05:42 PM IST

Fastags mandatory to all four wheelers : వాహనాదారులు తప్పక పాటించాల్సిందే.. దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఫాస్టాగ్‌ విధానం అమల్లోకి రానుంది. డిజిటల్, ఐటీ ఆధారిత టోల్‌ ఫీజుల చెల్లింపు విధానాలను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలను చేపడుతోంది.



అన్ని రకాల ఫోర్‌ వీలర్లకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. పాత వాహనాలు కూడా మినహాయింపు లేదు.. అన్ని పాత వాహనాలు కూడా తప్పనిసరిగా ఫాస్టాగ్ చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.



2021 జనవరి 1 నుంచి ఈ ఫాస్టాగ్ విధానంలో వర్తించనుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ కూడా జారీ అయింది. వాహనాలకు ఫాస్టాగ్‌ పునరుద్దరించిన తర్వాతే ఫిట్‌మెంట్‌ సర్టిఫికెట్‌ జారీ చేయడం తప్పనిసరి కానుంది. ప్రతి 4 చక్రాల వాహనం ఫాస్టాగ్ చేయించుకోవాల్సి ఉంటుంది.

టోల్ గేట్ల దగ్గర ఫాస్టాగ్‌ విధానాన్ని కేంద్రం 2017 నుంచే అమలు చేస్తోంది. 2019 అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా ఫాస్టాగ్‌ అమలును తప్పనిసరి చేసింది కేంద్రం.



ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలతో పాటు పాత వాహనాలకు సైతం ఫాస్టాగ్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. వచ్చే ఏడాది నుంచి అన్ని రకాల ఫోర్‌ వీలర్లకు కూడా ఫాస్టాగ్‌ తప్పనిసరి చేయనుంది.