Leopard
Leopard : దీపావళి పటాకుల భయంతో ఓ చిరుతపులి ఇంట్లో దాక్కున్న ఉదంతం తమిళనాడు రాష్ట్రంలో వెలుగుచూసింది. తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూర్‌లో దీపావళి పటాకులకు భయపడి చిరుతపులి ఓ ఇంట్లో ఆశ్రయం పొందిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన చిరుతపులి 15 గంటల పాటు ఇంట్లోనే ఉంది.
ALSO READ : Bengaluru : నెదర్లాండ్ వికెట్ తీసుకున్న కోహ్లీ… విరాట్‌కు బౌలింగ్ ఇవ్వాలంటూ అభిమానుల నినాదాలు
చిరుతపులిపై నిఘా ఉంచేందుకు అటవీశాఖ అధికారులు మూడు సీసీ కెమెరాలు, ఆటోమేటిక్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి చిరుతపులి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతుందని మేం ఆశిస్తున్నామని అధికారులు చెప్పారు. చిరుతపులి కదలికలపై నిఘా ఉంచడానికి తాము సీసీటీవీని చూస్తున్నామని ముదుమలై టైగర్ రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్ తెలిపారు.
#WATCH | Tamil Nadu: A leopard entered a house in the Coonoor's Brooklands area, in Nilgiri, yesterday morning and attacked 6 people. The leopard stayed for more than 15 hours inside the house and escaped late on Sunday. https://t.co/LiQq4fk599 pic.twitter.com/4x5REMaKv6
— ANI (@ANI) November 13, 2023