మహారాష్ట్ర సీఎం ఇంటికి చేరిన కరోనా వైరస్

మహారాష్ట్ర సీఎం నివాసంలో డ్యూటీలో ఉన్న మహిళా పోలీస్ కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ముంబైలోని ఉద్దవ్ ఠాక్రే అధికారిక నివాసం వర్షలో విధులు నిర్వహిస్తున్న ASIకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ప్రస్తుతం ఆమెను హాస్పిటల్ లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. దీంతో ఆమెకు దగ్గరిగా మెలిగిన ఆరుగురుని క్వారంటైన్ సెంటర్ కు తరలించారు.

మహారాష్ట్రలో దాదాపు 49మంది పోలీసులకు ఇప్పటివరకు కరోనా సోకినట్లు తేలింది. కాగా,దేశంలోనే అత్యధిక కరోనా కేసులు,మరణాలు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే మహారాష్ట్రలో 466కొత్త కరోనా కేసులు,9మరణాలు నమోదయ్యయి. కాగా,ఇప్పటివరకు దాదాపు 5వేల మందికి కరోనా సోకింది.