Vote On Account Budget : బ‌డ్జెట్‌కు వేళాయె! ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11.05గంటలకు నిర్మలా బడ్జెట్ ను పార్లమెంట్ కు సమర్పించనున్నారు.

budget session 2024

Nirmala Sitharaman : పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11.05గంటలకు నిర్మలా బడ్జెట్ ను పార్లమెంట్ కు సమర్పించనున్నారు. ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ రానున్న కేంద్ర బడ్జెట్ అంచనాలను ప్రతిభింభించేదిలా ఉంటుందని ఆర్థిక విశ్లేషకుల అంచనా. దీంతో మధ్యంతర అకౌంట్ బడ్జెట్ పై అంచనాలు పెరుగుతున్నాయి. ఆధాయ పన్ను మినహాయింపు పరిమితి పెంపు, మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రయోజనాలు,. దీర్ఘకాలిక పన్నుల విధానం, వినియోగం, పొదుపును పెంపొందించే చర్యలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.

Also Read : మధ్యంతర బడ్జెట్ అంటే ఏమిటి? ఎప్పుడు పెడతారు? ఏంటి ప్రయోజనం?

ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ, పూర్తిస్థాయి బడ్జెట్ లో ఉండేలాంటి ప్రయోజనాలను కొన్నింటిని ఆశించవచ్చునని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. సెక్షన్ 87ఏ కింద వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు కొంత రాయితీని అందించవచ్చునని, దీనికింద మొత్తం పన్ను మినహాయింపు పరిమితిని ఇప్పుడున్న 7లక్షల నుంచి 8లక్షల వరకు పెంచే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత ఆధాయ పన్నుకు సంబంధించి కొన్ని మినహాయింపులను కలిపి సింగిల్ హైబ్రిడ్ స్కీంను ఈ బడ్జెట్ లో ప్రకటించవచ్చునని అంచనా వేస్తున్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు పన్ను సడలింపులు ప్రయోజనాలను ఈ బడ్జెట్ లో ఆశించవచ్చునని అంచనా వేస్తున్నారు. రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన భత్యం పెంపు, బాలికల విద్యాప్రయోజనాలను పెంచడం కీలకమైనవని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

మొత్తానికి .. పేదలు, యువకులు, అన్నదాత, మహిళల కేంద్రంగా కేంద్ర మధ్యంతర బడ్జెట్ ఉండబోతుందని సమాచారం. ముఖ్యంగా EV, రియల్ ఎస్టేట్, ఆరోగ్య సంరక్షణ, విద్య, ఇంధనం, ఆటో, వ్యవసాయం, ఐటీ, రక్షణ రంగాలకు మధ్యంతర బడ్జెట్‌లో మేలు ఉంటుందని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల అనంతరం కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ లో, www.indiabudget.gov.inలో అందుబాటులో ఉండనుంది.

 

 

 

ట్రెండింగ్ వార్తలు