ఈ-సిగరెట్లపై నిషేధం విధిస్తూ ఇవాళ(సెప్టెంబర్-18,2019)సమావేశమైన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ-సిగరెట్లకు సంబంధించిన ఉత్పత్తి, తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం, పంపిణీ, నిల్వ, ఈ సిగరెట్లకు సంబంధించిన ప్రకటనలు అన్నీ బ్యాన్ చేసినట్లు ఆమె తెలిపారు.
పొగాకు సంబంధిత అనారోగ్యాల కారణంగా దేశంలో ప్రతి సంవత్సరం 9లక్షల మందికి పైగా మరణిస్తున్నారని,ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్థిక మంత్రి చెప్పారు.పార్లమెంటు తదుపరి సమావేశాల్లో దీనిపై ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఆమె అన్నారు. తొలిసారి ఈ-సిగరెట్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏడాది జైలు శిక్ష,రూ.లక్ష జరిమానా ఉంటుందన్నారు. ఎక్కువసార్లు నిబంధనలు ఉల్లంఘిస్తే మూడేళ్లు జైలు శిక్ష,రూ.5లక్షల జరిమానా ఉంటుందన్నారు. సాధారణ సిగరెట్లను కూడా తాము ప్రోత్సహించడం లేదని ఆమె తెలిపారు. పొగాకు వినియోగం తగ్గించాలనేదే ప్రభుత్వ ఆశయమని తెలిపారు.
భారతదేశంలో లైసెన్స్ లేని ఇ-సిగరెట్లు పొగాకును కాల్చవు, కానీ వినియోగదారు పీల్చే ద్రవ నికోటిన్‌ను ఆవిరి చేయడానికి తాపన మూలకాన్ని ఉపయోగిస్తాయి. అదే మండే సిగరెట్ నుండి దీన్ని వేరు చేస్తుంది. భారతదేశంలో 106 మిలియన్ల పెద్దలు ధూమపానం చేస్తూ మొదటిస్థానంలో ఉండగా, ప్రపంచంలో చైనా రెండవ స్థానంలో ఉంది.
Finance Minister Nirmala Sitharaman: The Union Cabinet has given approval to ban e-cigarettes. It means the production, manufacturing, import/export, transport, sale, distribution, storage and advertising related to e-cigarettes are banned. pic.twitter.com/qayCrQHPZp
— ANI (@ANI) September 18, 2019