Si Accused Of Forcing Dalit Young Man To Drink Urine
Si accused of forcing Dalit young man to drink urine : ఈ కంప్యూటర్ యుగంలో కూడా దళితులపై జరిగే ఎన్నో దారుణాల గురించి వింటున్నాం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో అగ్రకులస్తులకు చెందిన పెద్దలు దళితులకు రకరకాల శిక్షలు వేస్తుంటారు. ప్రేమ వివాహం చేసుకున్నాడని..అగ్రకులస్థులను గౌరవించలేదని ఇలా పలు కారణాలతో దళితులకు శిక్షలు వేస్తుంటారు. కానీ చట్టం ముందు అందరూ సమానమే అనే విషయం మరచిపోయాడో లేక అధికారం చేతిలో ఉంది కదానే అహంకారమో గానీ ఓ ఎస్సై ఓ దళిత యువకుడితో మూత్రం తాగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ ఫోన్‌కాల్‌కు సంబంధించిన వివాదంలో ఓ దళిత యువకుడిని స్టేషన్‌కు పిలిపించిన ఎస్సై అతడితో మూత్రం తాగించిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. చిక్కమగళూరులో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గోనిబీడు పీఎస్ పరిధిలోని కిరంగుడలో Kl పునిత్ అనే 22 ఏళ్ల యువకుడిని ఎస్సై అర్జున్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి అతడిని చిత్రహింసలకు గురించేసి ఆపై అతనితో మూత్రం తాగించాడని పునీత్ ఆరోపిస్తున్నాడు. కిరంగూడలో నివసిస్తున్న ఓ జంటను పునీత్ ఇబ్బందులకు గురిచేశాడని..మహిళకు ఫోన్ చేసి వేధిస్తున్నాడనీ..దీంతో సదరు మహిళ పునీత్ పై ఫిర్యాదు చేయటంతో అతడిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఎస్సై చిత్రహింసలకు గురిచేశాడనే ఆరోపణలు వస్తున్నాయి.
కానీ తనపై ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదనీ ఎస్సై తనపై కక్ష కట్టి స్టేషన్ లో బంధించి చిత్రహింసలు పెట్టాడని తనకు దాహం వేసి నీరు అడిగితే..నీరు ఇవ్వకుండా..లాకప్ లో ఉన్న మరో వ్యక్తిని తనపై మూత్రం పోయమని..లేకంటే అతడిని కూడా చిత్రహింసలు పెడతానని బెదరించి అతనితో నామీద మూత్రం పోయించాడని ఆ మూత్రాన్ని తాగమని నన్ను తీవ్రంగా కొట్టి మరీ తాగించాడని ఆరోపించాడు పునీత్. అలా తనను దాదాపు 12 గంటలసాటు నిర్భంధించి హింసించారని తెలిపాడు.
దీంతో ఎస్సై తీరుపై భగ్గుమన్న దళిత సంఘాలు భగ్గుమన్నాయి. దళితులు కాబట్టే ఇలా హింసిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పునీత్ ఘటనపై దళిత సంఘాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాయి. యువకుడితో మూత్రం తాగించిన ఎస్సై అర్జున్‌పై ఎఫ్ఐఆర్ నమోదైందని..అట్రాసిటీ చట్టం కింద నిర్బంధించడం, బెదిరింపు, అవమానానికి గురిచేయడం, హింసించడం వంటి ఆరోపణలతో కేసు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. అనంతం పునీత్ ను మే 10 రాత్రి 10.30గంటలకు విడుదల చేసి ఎస్సై అర్జున్ పై దర్యాప్తు చేస్తున్నారు.