Ramcharitmanas: రామచరితమానస్‭పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎస్పీ నేత మౌర్యపై ఎఫ్ఐఆర్

‘‘కొన్ని కోట్ల మంది ఈ గ్రంథాన్ని చదవలేదు. ఇందులో ఉన్నదంతా తప్పిదమే. వ్యక్తిగత ఆనందం కోసం, ప్రశంసల కోసం తులసీదాస్ ఈ గ్రంథాన్ని రాశారు. ధర్మం అంటే మేం దాన్ని స్వాగతిస్తాం. కానీ ధర్మం పేరు మీద దూషణలేంటి? దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాల మీద దూషణలు ఎందుకు చేశారు? వారికి శూద్రులని పేరు పెట్టి ఎందుకు వారిపై వివక్ష చూపించారు? దూషించడం, వివక్ష చూపించడమే ధర్మమా? అయితే అలాంటి ధర్మం అవసరం లేదు’’ అని స్వామి ప్రసాద్ మౌర్య అన్నారు.

Ramcharitmanas: రామచరితమానస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య మీద మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదైంది. ఐపీసీ సెక్షన్ 295ఏ, 298, 504, 505(2), 153ఏ కింద లక్నోలోని ఐష్‌బాగ్‌ నివాసి శివేంద్ర మిశ్రా ఈ ఫిర్యాదు చేశారు. రామచరితమానస్‌లోని కొన్ని భాగాలు కులం ప్రాతిపదకపై పెద్ద సంఖ్యలో ఉన్న ఒక వర్గాన్ని అవమానిస్తోందని, తక్షణం ఆ అభ్యంతరకర భాగాలను నిషేధించాలని మౌర్య గత ఆదివారంనాడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Digvijay Singh: కాంగ్రెస్ కస్సుమన్నా వెనక్కి తగ్గని దిగ్విజయ్.. మళ్లీ ప్రశ్నల వర్షం

గ్రంథంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీల మీద చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని, వారిని అనుచిత వ్యాఖ్యలతో దూషించారని మౌర్య అన్నారు. అటు ఇటుగా బిహార్ మంత్రి చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా అన్నట్లే స్వామి ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించారు. విధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆ గ్రంథం ఉందని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఆ పుస్తకాన్ని చదివితే వెనుకబడిన వారు దళితులు ఆగ్రహంతో రగిలి పోతారని, అల్లర్లు కూడా జరగొచ్చని అన్నారు.

AP BJP On Pawan Kalyan : పవన్ కల్యాణ్ పొత్తు వ్యాఖ్యలపై ఏపీ బీజేపీలో రచ్చ.. నేతల తలో మాట

ఇక ఈ గ్రంథంపై ఎమ్మెల్సీ అయిన స్వామి ప్రసాద్ మౌర్య తాజాగా స్పందిస్తూ ‘‘కొన్ని కోట్ల మంది ఈ గ్రంథాన్ని చదవలేదు. ఇందులో ఉన్నదంతా తప్పిదమే. వ్యక్తిగత ఆనందం కోసం, ప్రశంసల కోసం తులసీదాస్ ఈ గ్రంథాన్ని రాశారు. ధర్మం అంటే మేం దాన్ని స్వాగతిస్తాం. కానీ ధర్మం పేరు మీద దూషణలేంటి? దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాల మీద దూషణలు ఎందుకు చేశారు? వారికి శూద్రులని పేరు పెట్టి ఎందుకు వారిపై వివక్ష చూపించారు? దూషించడం, వివక్ష చూపించడమే ధర్మమా? అయితే అలాంటి ధర్మం అవసరం లేదు’’ అని స్వామి ప్రసాద్ మౌర్య అన్నారు.

ట్రెండింగ్ వార్తలు