AP BJP On Pawan Kalyan : పవన్ కల్యాణ్ పొత్తుల వ్యాఖ్యలపై ఏపీ బీజేపీలో రచ్చ.. నేతల తలో మాట

పొత్తుల గురించి జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీలో రచ్చ రాజుకుంది. పవన్ తో కలిసి వెళ్లే విషయంలో ఏపీ బీజేపీ నేతలు తలో రకంగా మాట్లాడుతున్నారు. పొత్తుల విషయంలో పవన్ నిర్ణయం ఎలా ఉన్నా కలిసి వెళ్దామంటూ ఓ వర్గం, ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే జనసేనతో తెగదెంపులు చేసుకుందామంటూ మరో వర్గం వాదిస్తోంది.

AP BJP On Pawan Kalyan : పవన్ కల్యాణ్ పొత్తుల వ్యాఖ్యలపై ఏపీ బీజేపీలో రచ్చ.. నేతల తలో మాట

AP BJP On Pawan Kalyan : పొత్తుల గురించి జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీలో రచ్చ రాజుకుంది. పవన్ తో కలిసి వెళ్లే విషయంలో ఏపీ బీజేపీ నేతలు తలో రకంగా మాట్లాడుతున్నారు. పొత్తుల విషయంలో పవన్ నిర్ణయం ఎలా ఉన్నా కలిసి వెళ్దామంటూ ఓ వర్గం, ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే జనసేనతో తెగదెంపులు చేసుకుందామంటూ మరో వర్గం వాదిస్తోంది. భీమవరంలో జరుగుతున్న ఏపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పవన్ తో పొత్తు వ్యవహారమే హాట్ టాపిక్ గా మారింది.

కుటుంబ పార్టీలకు తాము పోరాటం చేస్తున్నామని ఎంపీ జీవీఎల్ అన్నారు. పవన్ ఎవరితో అయినా కలిసి వెళ్తే.. మునిగిపోయే నావలో కాలేసినట్లే అన్నారు మరో నేత విష్ణువర్దన్ రెడ్డి. ఇతర పార్టీలతో పవన్ పొత్తు పెట్టుకుంటే బీజేపీ.. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తుందని విష్ణువర్దన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇది ఇలా ఉంటే.. జనసేన ఎవరితో కలిసి వచ్చినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు మరో బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి. పవన్ టీడీపీతో కలిసి వచ్చినా.. జనసేనతో పొత్తు పెట్టుకోవాలని తమ అధిష్టానానికి చెబుతున్నామన్నారు ఆదినారాయణ రెడ్డి. ఇలా.. పవన్ తో పొత్తుల గురించి బీజేపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందించారు.

Also Read..Pawan kalyan ‘VARAHI’ : ‘వారాహి’వాహనానికి పూజలు .. పొత్తుల గురించి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇక.. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా పవన్ వ్యాఖ్యలను బలపరిచారు. బీజేపీతో పొత్తులోనే ఉన్నాం అంటూ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారని, పొత్తులపై తామిద్దరం క్లారిటీతో ఉన్నామని సోము వీర్రాజు వెల్లడించారు. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదన్నారాయన. జనసేన, బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతుందన్నారు. సోమువీర్రాజు.

పొత్తులపై పవన్ హాట్ కామెంట్స్..
కొండగట్టులో ఆంజనేయ స్వామి సన్నిధిలో.. తన ఎన్నికల వాహనం వారాహికి పూజలు చేసిన జనసేనాని పవన్ కల్యాణ్.. పొత్తుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సిద్దాంతాలకు అనుగుణంగా ఉన్న పార్టీలతో కలిసి ముందుకెళతానని, తనతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటానని పవన్ అన్నారు. పొత్తులు కుదరకపోతే జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు జనసేనాని పవన్ కల్యాణ్. ఏపీలో ప్రస్తుతానికి బీజేపీతో పొత్తులోనే ఉన్నామన్న పవన్.. ‘వైసీపీ’ వ్యతిరేక ఓట్లు చీలకూడదని మరోసారి తేల్చి చెప్పారు. ఎన్నికలు దగ్గర పడ్డాక పొత్తుల గురించి ఆలోచిస్తామన్న పవన్.. ప్రస్తుతం పొత్తుల గురించి ఆలోచించే సమయం కాదని అన్నారు.

Also Read..Pawan Kalyan: తెలంగాణలో పోటీకి సిద్ధం.. బీజేపీతోనే జనసేన దోస్తీ: పవన్ కల్యాణ్

”జనసేన ప్రస్తుతానికి బీజేపీతో కలిసే ఉంది. రాబోయే రోజుల్లో ఎవరు కలిసొస్తారో వారితో కలిసి ముందుకెళతాం. కొత్త పొత్తులు కుదిరితే కొత్తగా ముందుకెళ్తాం. ఎవరు కలిసొచ్చినా, కలిసి రాకపోయినా ముందుకెళ్తాం. ఎవరూ కలిసి రాకపోతే ఒంటరిగా ముందుకెళ్తాం. అయినా, ఎన్నికలకు చాలా సమయం ఉంది. వారం రోజుల్లో ఎన్నికలు ఉంటే పొత్తుల గురించి మాట్లాడొచ్చు” అని పవన్ కల్యాణ్ అన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అన్ని పార్టీలు కలిసికట్టుగా పోటీ చేయాలనేదే తన కోరిక అని పవన్ మరోసారి చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓట్లను ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోమని మరోసారి స్పష్టం చేశారు.