Pawan Kalyan: తెలంగాణలో పోటీకి సిద్ధం.. బీజేపీతోనే జనసేన దోస్తీ: పవన్ కల్యాణ్

బీజేపీకి, జనసేనకు ఎప్పుడూ దోస్తీనే. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. జీహెచ్ఎమ్‌సీ ఎన్నికల్లాగా ఈ సారి వదిలేయం. పరిమిత స్థానాల్లోనే పోటీ చేస్తాం. 25-40 అసెంబ్లీ స్థానాల్లో, 7-14 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నాం. తెలంగాణలో పర్యటిస్తా.

Pawan Kalyan: తెలంగాణలో పోటీకి సిద్ధం.. బీజేపీతోనే జనసేన దోస్తీ: పవన్ కల్యాణ్

Updated On : January 24, 2023 / 5:14 PM IST

Pawan Kalyan: రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. మంగళవారం పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టులో పర్యటించి, వారాహికి వాహన పూజ చేయించారు. అనంతరం స్థానికంగా తెలంగాణ నేతలతో పవన్ సమావేశమయ్యారు.

Chandigarh Court: చండీగఢ్ కోర్టుకు బాంబు బెదిరింపు.. కోర్టు ఖాళీ చేసి తనిఖీ చేస్తున్న పోలీసులు

ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘బీజేపీకి, జనసేనకు ఎప్పుడూ దోస్తీనే. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. జీహెచ్ఎమ్‌సీ ఎన్నికల్లాగా ఈ సారి వదిలేయం. పరిమిత స్థానాల్లోనే పోటీ చేస్తాం. 25-40 అసెంబ్లీ స్థానాల్లో, 7-14 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నాం. తెలంగాణలో పర్యటిస్తా. తెలంగాణ సమస్యలపై లోతైన అధ్యయనం చేశాకే నిర్ణయం. తెలంగాణ ప్రజలకు సందేశాలు ఇచ్చే స్థాయిలో నేను లేను. వారి పోరాటాలు చూసి నేర్చుకున్నా. యువత బలిదానాల మధ్య తెలంగాణ ఏర్పడింది. పార్టీ పరంగా రాత్రికిరాత్రే ఎదగలేం. చాకలి ఐలమ్మ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి.

Rahul Gandhi: సర్జికల్ స్ట్రైక్స్‌పై ఎలాంటి ఆధారాలు అక్కర్లేదు.. దిగ్విజయ్ వ్యాఖ్యలు సరికాదు: రాహుల్ గాంధీ

సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి. మన భావజాలానికి దగ్గరగా ఉంటే పొత్తులు స్వీకరిస్తాం. ప్రతి నియోజకవర్గంలో తిరుగుతాం. కార్యకర్తలు వీధి పోరాటాలకు సిద్ధం కావాలి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సమస్యలు వేర్వేరు. రెండింటినీ పోల్చి చూడలేం. ఏపీతో పోలిస్తే తెలంగాణలో అభివృద్ధి జరిగింది. రాజకీయ కారణాలతో ఏపీలో ‘వారాహి’కి అనుమతి ఇవ్వలేదు. ఏపీలో కులాల గీతలు ఉంటాయి. ఎన్నికలప్పుడే పొత్తులపై ఆలోచిస్తాం. కొత్త పొత్తులు కుదిరితే కొత్తగా కలిసి వెళ్తాం. పొత్తులు కుదరకపోయినా ఒంటరిగానే వెళ్తాం. తెలంగాణ అసెంబ్లీలో పది మంది ఎమ్మెల్యేలైనా ఉండాలి అనుకుంటున్నా. తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉండదు. కానీ, నా మద్దతు మాత్రం ఉంటుంది’’ అని పవన్ వ్యాఖ్యానించారు.