Pawan kalyan ‘VARAHI’ : ‘వారాహి’వాహనానికి పూజలు .. పొత్తుల గురించి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

కొండగట్టు ఆంజనేస్వామికి ప్రత్యేక పూజలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం రథం ‘వారాహి’కి ప్రత్యేక పూజలు చేసి రథాన్ని ప్రారంభించారు.అనంతరం ఎన్నికల్లో పొత్తుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Pawan kalyan ‘VARAHI’ : ‘వారాహి’వాహనానికి పూజలు .. పొత్తుల గురించి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan kaly ‘VARAHI’

Pawan kalyan ‘VARAHI’ : తెలంగాణలోని కొండగట్టుపై వెలసిన ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేనపైనా..అధినేత పవన్ పైనే ఏపీ రాజకీయాలు ఫోకస్ అవుతున్న క్రమంలో వచ్చే ఎన్నికల్లో జనసేన ఏపార్టీతో పొత్తులు పెట్టుకుంటుంది? బీజేపీయా? టీడీపీయా? రెండింటితోనూనా? లేక జనసేన ఒక్కటే స్వతంత్రంగా పోటీ చేస్తుందా? ఇలా ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ పై ఫోకస్ కొనసాగుతోంది. ముఖ్యంగా అధికార వైసీపీ పార్టీ ఫుల్ ఫోకస్ అంతా పవన్ పైనే ఉంది. పవన్ ఏం చేసినా? ఏ ట్వీట్ పెట్టినా? ఏ సభలు నిర్వహించినా? ఏ ప్రసంగం చేసినా?…ఆఖరికి పవన్ ప్రతీ కదలికలపైనే వైసీపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. పవన్ సభలో ప్రసంగం అయిన వెంటనే వైసీపీ నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడేస్తుంటారు.

ఇలా జనసేన అధినేత పవన్ ఏపీ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉన్నారు. అటువంటి పవన్ ఎన్నికల ప్రచార రథం ‘వారాహి’వాహనం ప్రత్యేక డిజైన్ కూడా అంతే రేంజ్ లో వార్తల్లో నిలిచింది. ‘వారాహి’వాహనం డిజైన్, కలర్ ‘వారాహి’వాహనం రిజిస్ట్రేషన్ వంటి విషయాలు హాట్ హాట్ కొనసాగాయి. అటువంటి ‘వారాహి’వాహనానికి కొండగట్టు అంజన్న స్వామి సన్నధిలో పవన్ కల్యాణ్ పూజలు చేయించారు. కొండగట్టు ఆంజనేయునికి ప్రత్యేక పూజలు చేసి వాహనాన్ని ప్రారంభించారు.

అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో పవన్ మాట్లాడుతూ ఏపీలో రాజకీయాల్లో పొత్తులపై అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సిద్దాంతాలకు అనుగుణంగా ఉన్న పార్టీలో కలిసి ముందుకెళతానని తనతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటానంటూ వ్యాఖ్యానించారు. పొత్తులు కుదరకపోతే జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుంది అంటూ స్పష్టం చేశారు జనసేనాని పవన్ కల్యాణ్.  ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నామన్న పవన్ తను ఎప్పుడూ చెప్పిన మాట అయిన ‘వైసీపీ’వ్యతిరేక ఓట్లు చీలకూడదని అన్నారు. ఎన్నికల దగ్గరపడ్డాక పొత్తుల గురించి ఆలోచిస్తామని..ప్రస్తుతం పొత్తుల గురించి ఆలోచించే సమయం కాదని అన్నారు. అలాగే వారాహి అనే పేరుకు అర్థం చెప్పిన వవన్ ‘వారాహి’అంటే దుష్టులను శిక్షించేది అంటూ వివరించారు. అలాగే జనసేన తెలంగాణలో కూడా పనిచేస్తుందని..తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చిందని అటువంటి తెలంగాణలో జనసేన పనిచేస్తుందని అన్నారు.

కాగా కొండగట్టు ఆంజనేయునితో పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక అనుబంధముంది. గతంలో చాలాసార్లు ఈ ఆలయాన్ని ఆయన సందర్శించారు. 2024 ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని రాజకీయ పర్యటనకై ప్రత్యేకంగా హైదరాబాద్ లో చేయించిన వారాహి వాహనాన్ని కొండగట్టులో ప్రత్యేక పూజలతో ప్రారంభించటం పవన్ కు కొండగట్టు అంజన్నపై ఉన్న నమ్మకం..భక్తిని చాటి చెబుతున్నాయి.