Fire Accident (3)
Fire Accident: మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాల్గర్ జిల్లాలోని వాంఘోస్‌లో విశాల్ ఫైర్ వర్క్స్ పేరిట నిర్వహిస్తున్న కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటన స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో కార్మికులు పరిశ్రమలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫ్యాక్టరీలోని రసాయనాలు పేలినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు గాయపడినట్లు సమాచారం.