దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్-19 మహమ్మారి మూడవ తరంగం గురించి ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు రాష్ట్రంలో కాలుష్యం కొరలు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీపావళి పండుగ దగ్గర పడుతున్న నేపథ్యంలో దీపావళి పటాకులు పేల్చడం, లేదా అమ్మడం నేరంగా ప్రకటించారు.
ఈ క్రమంలోనే దీపావళి టపాకాయలు అమ్మినా, రోడ్ల మీద రూ. 1 లక్ష వరకు జరిమానా విధించవచ్చని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. మార్చిలో 32,000 మంది భారతీయులు సంక్రమణ బాధిత దేశాల నుండి తిరిగి వచ్చారని, అలాగే దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు తిరిగి వచ్చారని, ఢిల్లీ ఇప్పుడు చాలా కష్టమైన సమయాన్ని చూసిందని కేజ్రీవాల్ చెప్పారు.
వాయు కాలుష్యం సమస్యపై, ఢిల్లీ గాలి నాణ్యత జనవరి నుండి అక్టోబర్ మధ్య వరకు మంచిగా ఉందని, అయితే దీని తరువాత పంజాబ్, హర్యానా మరియు ఉత్తర ప్రదేశ్లలో మంటలు చెలరేగడం ప్రారంభం అయిందని, దాంతో వాయు కాలుష్యం పెరిగిందని అక్కడి ప్రభుత్వం చెప్పింది. ఈ క్రమంలోనే గ్రీన్ క్రాకర్స్‌తో సహా టపాసులు అమ్మడం, వాడకంపై పూర్తి నిషేధాన్ని విధించారు.