First Made-In-India Aircraft Carrier : విక్రాంత్‌ ట్రయిల్స్ ప్రారంభం

భారత తొలి స్వదేశీ అతిపెద్ద విమాన వాహక నౌక విక్రాంత్..నేవీ అమ్ములపొదిలో చేరేందుకు రెడీ అవుతోంది.

First Made-In-India Aircraft Carrier భారత తొలి స్వదేశీ అతిపెద్ద విమాన వాహక నౌక విక్రాంత్..నేవీ అమ్ములపొదిలో చేరేందుకు రెడీ అవుతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ భారీ విమాన వాహక నౌక తొలి సముద్ర పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. 1971 భారత్​-పాకిస్థాన్​ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన ఐఎన్​ఎస్​ విక్రాంత్​కు 50 ఏళ్లు పూర్తికావస్తున్న సందర్భంగా.. ఈ యుద్ధనౌకను బుధవారం సముద్రజలాల్లోకి ప్రవేశపెట్టిన్నట్లు నేవీ అధికారులు వెల్లడించారు.

విక్రాంత్‌ తొలి సముద్ర పరీక్షలు దేశం గర్వించదగిన చారిత్రక ఘట్టంగా భారత నౌకాదళం అభివర్ణించింది. 860 మీటర్ల పొడవు, 203 మీటర్ల వెడల్పు, 45 వేల మెట్రిక్‌ టన్నుల బరువున్న విక్రాంత్‌ను ఇండియన్‌ నేవీకి చెందిన నావల్ డిజైన్ డైరెక్టరేట్ రూపొందించింది. ఈ నౌక నిర్మాణానికి రూ.23వేల కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీ ట్రయల్స్​ సాగిస్తున్న ఈ నౌక.. వచ్చే ఏడాది ఆగస్టులో నేవీ సేవలకు అందుబాటులో ఉంటుంది. ఈ ఎయిర్​క్రాఫ్ట్​ కేరియర్​ తయారీతో స్వదేశీ పరిజ్ఞానంతో దీటైన యుద్ధనౌకలు ఉన్న దేశాల జాబితాలో భారత్​ చేరిందని అధికారులు తెలిపారు. కాగా,ప్రస్తుతం భారత్​కు ఎయిర్​క్రాఫ్ట్​ కేరియర్​గా ఐఎన్​ఎస్​ విక్రమాదిత్య మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఈ జాబితాలోకి విక్రాంత్​ చేరనుండటం వల్ల నౌకాదళానికి మరింత బలం చేకూరుతుంది.

ట్రెండింగ్ వార్తలు