Jammu Kashmir Navratri 2023 : స్వాతంత్ర్యం వచ్చాక కశ్మీర్‌లో తొలిసారి నవరాత్రి వేడుకలు

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఈ 75 ఏళ్లలో తొలిసారి నియంత్రణ రేఖ వద్ద శారదా ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. 75 ఏళ్లలో తొలిసారిగా జమ్ము కశ్మీర్ లోని శారదా జరిగిన వేడుకల్లో దేశం నలుమూలల నుంచి అనేక మంది భక్తులు పాల్గొన్నారు.

Jammu Kashmir Navratri Celebrations 2023

Jammu Kashmir Navratri Celebrations 2023 : భారతదేశంలో కశ్మీర్ అంటే ఓ ప్రత్యేకత. అందాలకు నెలవైన కశ్మీర్ నివురుగప్పిన నిప్పులా రగులుతునే ఉంటుంది. నిబంధనలు అతిక్రమించే పాకిస్థాన్ చర్యలతో కశ్మీర్ ఎప్పుడు ఓ ప్రత్యేకంగానే నిలుస్తుంది. అటువంటి కశ్మీర్ లో ఏ జరిగినా ఓ విశేషమే. బ్రిటీష్ వారి నుంచి స్వాతంత్ర్యం పొందాక కశ్మీర్ లో ఎప్పుడు జరగని ఓ ప్రత్యేకత సంతరించుకుంది ఈ ఏడాది దశమి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా. అదే..స్వాతంత్ర్యం వచ్చాక కశ్మీర్ లో తొలిసారి నవరాత్రి ఉత్సవాలు జరగటం.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఈ 75 ఏళ్లలో తొలిసారి నియంత్రణ రేఖ వద్ద శారదా ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. దేశం స్వేచ్ఛా వాయువు పీల్చుకున్నాక నెలకొన్న పరిణామాలతో భారత్, పాకిస్థాన్ దేశాలుగా విడిపోయాయి. ఒకప్పుడు ఒకే దేశస్థులుగా ఉన్నప్పటికి రెండు దేశాలుగా విడిపోయాక దాయాది దేశాలుగా మారిపోయాయి. దీంట్లో భాగంగా ఏర్పరచుకున్న నిబంధనల్ని పాక్ ఎప్పటికప్పుడు అతిక్రమిస్తునే ఉంది. దీంట్లో భాగంగా దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఉగ్రవాదుల్ని పెంచి పోషించే పాక్ భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతునే ఉంటుంది. భారత్ ఎప్పటికప్పుడు తిప్పి కొడుతునే ఉంటుంది.

Dussehra 2023 : పాండవులకు పాలపిట్టకు సంబంధమేంటి..?దస‌రా రోజు పాల‌పిట్ట‌ను ఎందుకు చూడాలి..?

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో వేర్పాటు వాదంతో ఉగ్ర దాడులు, ఉగ్రవాద శిబిరాలు దుందుడుకు చర్యలతో ఘర్షణలు జరుగుతుంటుంటాయి. దేశ విభజన తరువాత అనేక హిందూ దేవాలయాలను మూసివేసిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కశ్మీర్ లో కూడా అటువంటిపరిస్థితులున్నాయి. ఈ క్రమంలో ఇన్ని దశాబ్దాల తరువాత కశ్మీర్ లో తొలిసారి పాక్ ఆక్రమిత కాశ్మీర్ సమీపంలో ఉన్న కాశ్మీర్ శక్తి పీఠంలో తొలిసారి శారదా నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు. దేశ విభజన తర్వాత గత 75 ఏళ్లలో తొలిసారిగా ఇక్కడ జరిగిన వేడుకల్లో దేశం నలుమూలల నుంచి అనేక మంది భక్తులు పాల్గొన్నారు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ సమీపంలో కుప్వారా జిల్లా పరిధిలోని టిట్వాల్ గ్రామంలో శారదా మాత ఆలయం ఉంది. భారత్ లోని 18 శక్తి పీఠాల్లో ఒకటిగా పరిగణించే ఈ శారదా మాత ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉందని చెబుతుంటారు. అటువంటి శారదా ఆలయంలో స్వాతంత్ర్యం వచ్చాక ఇన్నేళ్లకు నవరాత్రి ఉత్సవాలు జరగటంతో భక్తులు భారీగా తరలివచ్చి వేడుకల్లో పొల్గొంటున్నారు.

Bathukamma 2023: బృహదీశ్వరాలయానికి బతుకమ్మకు సంబంధమేంటి..?