Bihar Adulterated Liquor: బీహార్‌లో కల్తీ మద్యం సేవించిన ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. 12మంది నిందితులు అరెస్ట్..

బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం మరోమారు కలకలం చేరింది. సివాన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతనే వీరి మరణాలు ఎలా సంభవించాయని తెలుస్తుందని తెలిపారు. మరోవైపు, కల్తీ మద్యం వల్లనే మరణాలు సంభవించినట్లు మృతుల కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.

Bihar Adulterated Liquor: మద్యపాన నిషేదంఉన్న బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో కల్తీ మద్యం సేవించి 75 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవకముందే సివాన్ లోని లక్కీ నబీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ మద్యం మరణాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా జరిగిన ఈ ఘటనలో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మరణించినట్లు తెలుస్తోంది. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతులంతా బాలా గ్రామానికి చెందినవారు.

Bihar liquor consumption: మద్యపాన నిషేధం ఉన్న బిహార్‌లో మళ్ళీ కల్తీ మద్యం కలకలం

కల్తీ మద్యం సేవించినందు వల్లనే వీరంతా చనిపోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే, అధికార యంత్రాంగం మాత్రం ఇప్పటి వరకు ఈ మరణాలు కల్తీ మద్యం సేవించడం వల్లనే సంభవించాయన్న విషయాన్ని ధృవీకరించలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత ఈ మరణాలకు కారణం ఏవిషయం అనేది చెబుతామని అధికారులు పేర్కొంటున్నారు.

Bihar Adulterated Liquor : బీహార్ లో కల్తీ మద్యం సేవించి 73 మంది మృతి.. కీలక నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

కల్తీ మద్యం సేవించి మరణాలు చోటు చేసుకున్న గ్రామం, పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అంతేకాక, కంటిచూపు మందగించిన వారిని సివాన్‌లోని సదర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నారు. మరోవైపు కల్తీ మద్యం స్థావరాలపై పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

ట్రెండింగ్ వార్తలు