Flipkart : నటుడికి చేదు అనుభవం.. ఇయర్‌ఫోన్స్ ఆర్డర్ చేస్తే ఖాళీ బాక్స్ వచ్చింది
న్‌లైన్ కొనుగోళ్లలో కొన్ని సార్లు పొరపాట్లు దొర్లుతాయన్న విషయం తెలిసిందే.. మనం ఒకటి బుక్ చేస్తే ఇంకో వస్తువు ఇస్తుంటారు.
- kunduru Vinod
- Updated on- October 16, 2021 / 10:21 AM IST
Flipkart1
Flipkart : ఆన్లైన్ కొనుగోళ్లలో కొన్ని సార్లు పొరపాట్లు దొర్లుతాయన్న విషయం తెలిసిందే.. మనం ఒకటి బుక్ చేస్తే ఇంకో వస్తువు ఇస్తుంటారు. అయితే కొన్ని సార్లు ఖాళీ డబ్బాలను పంపుతారు. తాజాగా అటువంటి అనుభవమే ఓ టీవీ యాంకర్ కి ఎదురైంది. మరాఠీ టీవీ యాక్టర్ పరాస్ కల్నావత్ ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఇయర్‌ఫోన్స్‌ను కొనుగోలు చేశాడు. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ సిస్టమ్ జరిగిన పొరపాటు వలన అతడికి ఖాళీ బాక్స్ వచ్చింది.
చదవండి : మళ్లీ అవకాశం రాకపోవచ్చు.. ఫ్లిప్ కార్ట్‌లో రూ.10వేల లోపు టాప్-5 ఫోన్లు ఇవే!
దీనిని వెంటనే తన ట్విట్టర్ ఖాతాలో పెట్టి ఫ్లిప్‌కార్ట్ ఇంట చెత్త డెలివరీ సిస్టమ్ కలిగి ఉందా అంటూ ఆ సంస్థను ట్యాగ్ చేశాడు. దీంతో వెంటనే స్పందించిన స్లిప్కార్ట్ సపోర్ట్ టీమ్.. మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఆర్డర్ ఐడీ షేర్ చేస్తే దానికి సంబంధించిన ఇయర్‌ఫోన్స్ పంపిస్తామని హామీ ఇచ్చింది. పరాస్ కల్నావత్ ట్వీట్ చూసిన నెటిజన్లు తమకు కూడా ఇటువంటి సంఘటనలు ఎదురయ్యాయని.. ట్వీట్ చేశారు.
చదవండి : స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్.. రూ. 18వేలకే iPhone వచ్చేస్తుంది
