Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్‌లో 80శాతం డిస్కౌంట్ ఆఫర్లు.. బిగ్ దీపావళి సేల్‌!

దసరా సంధర్భంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కష్టమర్ల కోసం తీసుకుని వచ్చిన బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగిసింది.

10TV Telugu News

Flipkart Big Diwali Sale: దసరా సంధర్భంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కష్టమర్ల కోసం తీసుకుని వచ్చిన బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగిసింది. పండుగ సీజన్‌లో మరోసారి ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌ను తీసుకుని వచ్చింది. అక్టోబర్ 17వ తేదీ నుంచి ఈ సేల్ ప్రారంభం కాబోతుంది. ఈ సేల్ అక్టోబర్ 23వ తేదీ వరకు కొనసాగనుంది. సేల్స్ సమయంలో మొబైల్‌లు, టాబ్లెట్‌లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై అద్భుతమైన డిస్కౌంట్లు ఇవ్వబోతుంది ఫ్లిప్‌కార్ట్.

అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ అక్టోబర్ 16వ తేదీనే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు అందుబాటలో ఉంటుంది. ఈ సేల్‌లో, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు, యాక్సిస్ బ్యాంక్ కార్డ్ వినియోగదారులు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. Flipkart ఇంకా డీల్స్ ప్రివ్యూను షేర్ చేయలేదు కానీ, ఈ-కామర్స్ సైట్‌లో విడుదల చేసిన పేజీ ప్రకారం, బిగ్ దీపావళి సేల్ సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లపై 80శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు అని అర్థం అవుతుంది.

ఎలక్ట్రానిక్స్‌, యాక్స్‌సరీస్‌, టీవీ, అప్లయన్సెస్‌పై 75శాతం డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ కస్టమర్లకు పేజీ ద్వారా ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌లో విడుదల చేసిన పేజీలో, ప్రతిరోజూ మాడు ప్రత్యేకమై సమయాల్లో (12AM, 8AM, 4PM)కి సేల్ సమయంలో, క్రేజీ డీల్స్ చూపనుంది ఫ్లిప్‌కార్ట్. ఈ రాబోయే సేల్‌లో, కస్టమర్‌లు హెడ్‌ఫోన్‌లు, స్పీకర్లపై 70 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్‌లోని డీల్స్ గురించి పెద్దగా చెప్పలేదు. కానీ, కస్టమర్లు షర్టులు, ట్రౌజర్‌లపై 80శాతం వరకు, స్పోర్ట్స్ షూస్‌పై 80 శాతం వరకు, ఫర్నిచర్, పరుపులపై 85 శాతం వరకు, ఫ్లిప్‌కార్ట్ ఒరిజినల్స్‌లో 80శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు అని అర్థం అవుతుంది.