Flipkart: మళ్లీ అవకాశం రాకపోవచ్చు.. ఫ్లిప్ కార్ట్‌లో రూ.10వేల లోపు టాప్-5 ఫోన్‌లు ఇవే!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈసారి మొబైల్ ఫోన్లపై అధ్భుతమైన ఆఫర్లు లభిస్తున్నాయి.

Flipkart: మళ్లీ అవకాశం రాకపోవచ్చు.. ఫ్లిప్ కార్ట్‌లో రూ.10వేల లోపు టాప్-5 ఫోన్‌లు ఇవే!

Big Billion Days

Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈసారి మొబైల్ ఫోన్లపై అధ్భుతమైన ఆఫర్లు లభిస్తున్నాయి. రూ.10వేల లోపు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కోసం మీరు చూస్తున్నట్లయితే అక్టోబర్ 10న ముగుస్తున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్‌లో వెంటనే కొనుక్కొండి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో 5000mAh, 6000mAh, 48MP కెమెరా, 64MP రేర్ కెమెరా రూ. 10వేల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేసుకోవచ్చు. అయితే, ఇది పరిమిత కాలం సేల్ ఆఫర్.

Samsung Galaxy F12:
ధర – రూ .9,499
Samsung Galaxy ఎఫ్12 స్మార్ట్‌ఫోన్‌లో 90Hz డిస్‌ప్లే, ఎక్సినోస్ 850 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్, 6000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్12 స్పెసిఫికేషన్స్:
డిస్‌ప్లే: 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఇన్ఫినిటీ వీ 90Hz డిస్‌ప్లే
ర్యామ్: 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
ప్రాసెసర్: సాంసంగ్ ఎక్సినోస్ 850
రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ ISOCELL GM2 ప్రైమరీ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 6000ఎంఏహెచ్ (15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11 + వన్‌యూఐ 3.1
సిమ్ సపోర్ట్: డ్యూయెల్
కలర్స్: సెలెస్టియల్ బ్లాక్, స్కై బ్లూ, సీ గ్రీన్

Infinix Hot 10S: ఇన్ఫినిక్స్ హాట్ 10ఎస్ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ వేరియంట్ అసలు ధర రూ.9,999 కాగా, ఆఫర్ ధర రూ.9,499. డిస్కౌంట్ రూ.500 లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో అదనంగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు

ఇన్ఫినిక్స్ హాట్ 10S స్మార్ట్‌ఫోన్ 6.82-అంగుళాల HD ప్లస్ IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో 1640×720 పిక్సెల్స్ రిజల్యూషన్ ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 90Hz. ఇందులో ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ ఇవ్వబడింది. వినియోగదారులు ఫోన్‌లో Android 11 ఆధారిత XOS 7.6 ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ పొందవచ్చు.

Tecno Camon 16:
ధర – రూ. 9,999
టెక్నో కేమన్ 16 స్మార్ట్‌ఫోన్‌లో 6.8-అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంటుంది. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 89.1గా ఉంటుంది. ఫోన్ Android-10 ఆధారిత HiOS 7.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఫోన్‌లో సెల్ఫీ కోసం డిస్‌ప్లేలో పంచ్ హోల్ డిజైన్ ఇస్తారు. మీడియాటెక్ హెలియో జీ79 ప్రాసెసర్ టెక్నో కామన్ 16 స్మార్ట్‌ఫోన్‌లో సపోర్ట్ చేస్తుంది. ఇందులో 64MP ప్రాథమిక సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్, 2MP మాక్రో లెన్స్ మరియు AI లెన్స్ ఉన్నాయి. ఇందులో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. టెక్నో కామన్ 16 స్మార్ట్‌ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది.

Micromax IN Note 1:
ధర – రూ .9,499(యాక్సిస్ బ్యాంక్ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో రూ.8,549 ధరకే కొనొచ్చు.)

మైక్రోమ్యాక్స్ IN నోట్ 1 స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల పంచ్-హోల్ HD+ డిస్‌ప్లే ఉంటుంది. అలాగే, ఫోన్‌లో మెరుగైన పనితీరు కోసం మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ఇచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్-10 ఆధారిత స్టాక్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ కెమెరా సెటప్‌ అందుబాటులో ఉంటుంది. ఇందులో 48MP ప్రైమరీ లెన్స్, 5MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2MP మాక్రో, డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది.

Realme C20:
రియల్‌మీ సీ20 స్మార్ట్‌ఫోన్ 2జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.7,499 కాగా ఆఫర్‌లో రూ.6,999 ధరకే లభిస్తుంది. రూ.500 డిస్కౌంట్ పొందొచ్చు. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో అదనంగా 10 శాతం తగ్గింపు లభిస్తుంది.