రూ. లక్షా 70వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం

  • Publish Date - March 26, 2020 / 08:09 AM IST

కరోనా వైరస్ దెబ్బకి దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోతోంది. ఇప్పటికే పలు రంగాలపై కోవిడ్ 19 వల్ల తీవ్ర ప్రభావం పడుతోంది. వృద్ధి రేటు తగ్గుదలతో ఇప్పటికే గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థపై కరోనా వల్ల మళ్లీ పెను ప్రభావం పడుతుంది. 

ఈ క్రమంలోనే కేంద్రం 21రోజుల లాక్ డౌన్ ప్రకటించగా.. నష్ట నివారణ చర్యలను చేపట్టింది కేంద్రం. ఈ క్రమంలోనే  రూ. లక్షా 70వేల కోట్లతో కరోనా ప్యాకేజీ ప్రకటించింది కేంద్రం. ఇందులో నగదు బదిలీ, నిత్యావసర వస్తువులు ఇవ్వడం, కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన వారికి ఆర్థిక సాయంగా కరోనా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది కేంద్రం.

ఇందులో భాగంగా వలస కూలీలను ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది. వైద్య, ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బందికి  50లక్షల ఇన్సూరెన్స్ కవర్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆశావర్కర్లకు కూడా ఇన్సూరెన్స్ కవర్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వచ్చే మూడు నెలల పాటు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో ఆర్థిక ప్యాకేజ్ అందజేయనున్నారు. 
 
80కోట్ల మంది ప్రజలకు నెలకు 5కేజీల బియ్యం.. ఇప్పుడు ఇస్తున్నదానికి అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బియ్యం బదులు గోదుమలు కావాలంటే కూడా తీసుకోవచ్చు. అలాగే ఒక కేజీ కంది పప్పు కూడా ఇస్తారు.

Also Read | దోమ వల్ల కరోనా వస్తుందా?: కేంద్రం క్లారిటీ!