ఇవాళ(ఫిబ్రవరి-1) పార్లమెంట్ లో కేంద్రప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ లోక్ సభలో ుదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ మరికాసేపట్లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న సమయంలో రాష్ట్రపతి తో పియూష్ గోయల్ సమావేశమయ్యారు. ఇప్పటికే బడ్జెట్ కు సంబంధించిన కాపీలు పార్లమెంట్ కు చేరుకున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా ఉదయం 10 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశమయింది.