దేశ వ్యాప్తంగా ఇంటింటికీ సర్వే: కరోనా తగ్గిందా..లేదా..?

కేంద్ర హోం శాఖ సోమవారం COVID-19 సర్వే చేయాలని 10 రాష్ట్రాలకు సూచించింది. 10రాష్ట్రాల్లోని 38జిల్లాల్లో 45 మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో ఇంటింటికి తిరిగి సర్వే చేయనున్నారు. దాంతో పాటు అవసరమైన కుటుంబాలకు పరీక్షలు కూడా నిర్వహిస్తారు.
మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్, జమ్మూ అండ్ కశ్మీర్, కర్ణాటక, ఉత్తరాఖాండ్, మధ్య ప్రదేశ్‌ల కేంద్ర ఆరోగ్య సెక్రటరీ ప్రీతి సూదన్ సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. జిల్లా కలెక్టర్లు, మనిసిపల్ కమిషనర్లు, జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్లు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్స్ ఈ మీటింగ్ లో పాల్గొన్నారు.
రాబోయే నెలల్లో జిల్లాల వారీగా సర్వే చేయనున్న ప్లాన్ ను తెలియజేయాలన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం తమ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను జూన్ 30వరకూ పొడిగించనున్నట్లు ప్రకటించారు. మిజోరాం సీఎం జోరంతంగా కూడా మరో రెండు వారాల లాక్ డౌన్ ను అనౌన్స్ చేశారు.
జిల్లాల్లో ఉండే హెల్త్ అధికారులకు ప్రజలు సహకరించాలని హెల్త్ సెక్రటరీ కోరారు. హెల్త్ సర్వీసులు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని.. ట్రీట్‌మెంట్ చేయించుకునేందుకు కాన్ఫిడెన్స్ తో సరైన సమయంలో ముందుకు రావాలని తెలిపారు.
Read: కరోనా పేరుతో ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ