Newborn Baby Foetus: 40రోజుల పసిబిడ్డ కడుపులో మరో పిండం

బీహార్‌లో ఓ అరుదైన ఘటన నమోదైంది. 40 రోజుల నవజాత శిశువు కడుపులో పిండం అభివృద్ధి చెందుతున్నట్లు తెలిసింది. శిశువు పొట్ట భాగంలో ఉబ్బి ఉండటాన్ని గమనించిన పేరెంట్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లగా విషయం బయటపడింది.

Newborn Baby Foetus: బీహార్‌లో ఓ అరుదైన ఘటన నమోదైంది. 40 రోజుల నవజాత శిశువు కడుపులో పిండం అభివృద్ధి చెందుతున్నట్లు తెలిసింది. శిశువు పొట్ట భాగంలో ఉబ్బి ఉండటాన్ని గమనించిన పేరెంట్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లగా విషయం బయటపడింది. ఇటీవల మోతీహారీ రహ్మానియా మెడికల్ సెంటర్‌కు చికిత్స కోసం తీసుకువచ్చారు.

శిశువు పొట్ట దగ్గర ఉబ్బినట్లుగా ఉంది. కడుపు ఉబ్బరం కారణంగా లేదా మూత్ర విసర్జన చేయలేకపోవడమే దీనికి కారణమా అని వైద్య పరీక్షలు జరిపామని వైద్యులు తెలిపారు.

బీహార్‌లోని రహ్మానియా మెడికల్ సెంటర్‌కు చెందిన డాక్టర్ తబ్రేజ్ అజీజ్, కడుపు ఉబ్బరం, మూత్రం ఆగిపోవడం వెనుక కారణం కోసం పరీక్షలు జరిపారు. CT స్కాన్ చేయగా.. అప్పటికే కడుపులో మరొక పిండం ఏర్పడిందని తెలియడంతో అందరూ షాక్ అయ్యారు.

Read Also : అంత్యక్రియలు చేస్తుండగా.. చనిపోయిందనుకున్న శిశువు కదిలింది..!

నవజాత శిశువులో ఈ అరుదైన సంఘటనను ‘ఫీటస్ ఇన్ ఫీటూ’ లేదా వైద్య పరిభాషలో పిల్లల పొట్టలో పిండం ఉన్నట్లుగా పిలుస్తారని డాక్టర్ తబ్రేజ్ అజీజ్ న్యూస్ ఏజెన్సీకి వెల్లడించారు. ప్రతి ఐదు లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇటువంటి అరుదైన సందర్భం సంభవిస్తుందని వైద్యులు అంటున్నారు.

డాక్టర్ అజీజ్ మాట్లాడుతూ, “40 రోజుల పసికందు కడుపులో పిండం అభివృద్ధి చెందడాన్ని గమనించాం.దీనిని ఫీటస్ ఇన్ ఫీటూ అంటారు. శిశువుకు శస్త్రచికిత్స చేశాం. పరిస్థితి నిలకడగానే ఉంది.”

నవజాత శిశువు సర్జరీ అనంతరం పూర్తిగా క్షేమంగా ఉందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యిందని డాక్టర్ అజీజ్ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు