Newborn Girl Child : అంత్యక్రియలు చేస్తుండగా.. చనిపోయిందనుకున్న శిశువు కదిలింది..!
Newborn Girl Child : చనిపోయిందనుకున్న శిశువు కదిలింది. బతికుండానే అప్పుడే పుట్టిన శిశువుకు అంత్యక్రియలు చేయబోయ్యారు.

Jammu And Kashmir Shocker Newborn Girl Child, Declared Dead, Found Alive After Being Buried In Banihal
Newborn Girl Child : చనిపోయిందనుకున్న శిశువు కదిలింది. బతికుండానే అప్పుడే పుట్టిన శిశువుకు అంత్యక్రియలు చేయబోయ్యారు. ఇంతలో శిశువు కదిలేసరికి ఆ పాప తల్లిదండ్రులు సంతోషంతో పొంగిపోయారు. జమ్ము కశ్మీర్ లోని రాంబన్ ప్రాంతంలో సబ్ డిస్ట్రిక్ట్ ఆస్పత్రి బనిహాల్‌లో సోమవారం ఈ ఘటన జరిగింది. బతికి ఉన్న శిశువును పరీక్షించిన వైద్యులు చనిపోయిందని ధ్రువీకరించారు. దాంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. శిశువుకు అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్లారు.
అంతలోనే పసికందులో చలనం కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. బతికి ఉన్న శిశువును చనిపోయిందన్న వైద్యులపై పాప తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని బాధిత కుటుంబసభ్యులు మండిపడ్డారు. ఆస్పత్రి ముందు బైఠాయించారు. అధికారుల దృష్టికి వెళ్లడంతో వెంటనే రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ఆస్పత్రి ఉద్యోగులను సస్పెండ్ చేశారు.

Jammu And Kashmir Shocker Newborn Girl Child, Declared Dead, Found Alive After Being Buried In Banihal
బంకూట్ నివాసి బషారత్ అహ్మద్ భార్య ఆస్పత్రిలో ప్రసవించింది. అయితే కాసేపటికే పాప చనిపోయిందని ఆస్పత్రి సిబ్బంది కుటుంబసభ్యులకు చెప్పారు. పాప పుట్టిందనే ఆనందం క్షణాల్లోనే ఆవిరైపోయింది. కుటుంబమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కుటుంబసభ్యులు చిన్నారిని అంత్యక్రియల కోసం తీసుకెళ్లారు.
ఆ సమయంలో పసికందు ఒక్కసారిగా కదులుతున్నట్లు గమనించారు. వెంటనే, శిశువును మళ్లీ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం శ్రీనగర్‌లోని ఆస్పత్రికి పంపించారు. ఎస్‌డిహెచ్ బనిహాల్‌లోని గైనిక్ విభాగంలో జూనియర్ స్టాఫ్ నర్స్ సుమీనా బేగం, స్వీపర్ హజారా బేగంల నిర్లక్స్యమే దీనికి కారణమని తేల్చారు.
Baby girl who was declared dead at hospital in J&K’s Banihal soon after birth this morning was found to be alive when family was forced to dig up her grave nearly hour after she was buried, officials say. Locals had objected to her burial in their graveyard.
— Press Trust of India (@PTI_News) May 23, 2022
Read Also : Newborn Son sells: కన్నాను గానీ పెంచలేను బిడ్డా: మూడు రోజుల బిడ్డను రూ.1.78 లక్షలకు అమ్మేసిన తల్లి