Newborn Son sells: కన్నాను గానీ పెంచలేను బిడ్డా: మూడు రోజుల బిడ్డను రూ.1.78 లక్షలకు అమ్మేసిన తల్లి

బిడ్డను అమ్ముకునే హక్కు కన్నతల్లికి కూడా లేదు. కానీ మరోబిడ్డ అమ్మ ఒడికి దూరమయ్యాడు. కాసులు దక్కాయి. బిడ్డ చేతులు మారింది. కానీ చట్టం ఊరుకోనంది. ఫలితంగా..

Newborn Son sells: కన్నాను గానీ పెంచలేను బిడ్డా: మూడు రోజుల బిడ్డను రూ.1.78 లక్షలకు అమ్మేసిన తల్లి

Newborn Son Sells

Mother sells 3 day old son for rs. 1. 78 lakh : తినటానికి తిండి లేదు. కానీ బిడ్డను కన్నది. కానీ ఆ బిడ్డకు పాలు పట్టి పెంచే స్తోమత లేదు. బిడ్డ ఏడుపు తల్లి గుండెల్ని బద్దలు చేస్తోంది. దీంతో బిడ్డను అమ్మేద్దామనుకుంది. చంటిబిడ్డ కడుపు నింపలేని స్థితిలో ఉన్న నాకు బిడ్డలెందుకు? అని ఆమె అనుకుని ఉంటే కన్నపేగును అమ్ముకోవాల్సిన దారుణ దుస్థితికి బహుశా ఆమె నెట్టివేయబడేదికాదేమో. కానీ ప్రకృతి ధర్మం. బిడ్డను కన్నది.కానీ పెంచలేకపోయింది.

కారణం పేదరికం. మామూలు పేదరికం కాదు. కటిక దరిద్రం.దీంతో కన్నబిడ్డను అమ్మకానికి పెట్టింది. ఎవరైనా బిడ్డను కొనేవారుంటే చూసిపెట్టమని కొంతమందికి చెప్పింది.దానికి కొంతమంది ఆడవారు సహకరించారు. బేరం కుదిర్చారు. అంతే బిడ్డను అమ్మేసింది. రూ.1.78 లక్షలకు. మగబిడ్డ కదా..చక్కగా ఎవరో కొనేసుకున్నారు. కానీ బిడ్డను అమ్ముకునే హక్కు తల్లికి కూడా లేదు. ఇది చట్టం. ఆ చట్టం ఆమెను అరెస్ట్ చేసింది. బిడ్డను అమ్మిన నేరానికి ఆ తల్లిని అరెస్ట్ చేశారు పోలీసులు.

Read more : 3నెలల కన్నబిడ్డను అమ్మి..ఆ డబ్బుతో బైక్..ఫోన్ కొని జల్సాలు

మ‌హారాష్ట్ర‌లోని అహ్మ‌ద్‌న‌గ‌ర్ జిల్లా షిర్డీలో ఓ తల్లి పేదరికంతో మూడు రోజుల మగబిడ్డను రూ.1.78 లక్షలకు అమ్మేసింది. బిడ్డను అమ్మినందుకు ఆమెతో పాటుఆమెకు సహకరించిన మరో న‌లుగురితో పాటు శిశువును కొన్న వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. డొంబివిలిలోని మ‌న్ప‌డ పోలీస్ స్టేష‌న్‌లో న‌వంబ‌ర్ 7న దాఖ‌లైన ఎఫ్ఐఆర్ ప్ర‌కారం..సెప్టెంబ‌ర్‌లో మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన మ‌హిళ కుటుంబం పేద‌రికంలో మ‌గ్గుతుండ‌టంతో శిశువును పోషించ‌లేక‌పోయింది. బిడ్డను అమ్మి డబ్బులు చేసుకుందామనుకుంది. కొనేవారి కోసం వెతికింది. అహ్మ‌ద్‌న‌గ‌ర్‌, థానేకు చెందిన క‌ళ్యాణ్‌, ముంబైలోని ములుంద్‌కు చెందిన ముగ్గురు మ‌హిళ‌లు ఆమెకు స‌హ‌క‌రించారు. మంచి బేరం తెచ్చారు.

Read more : మద్యానికి బానిసై కన్నబిడ్డను అమ్మేసిన తండ్రి

ములుంద్‌లో నివ‌సించే వ్య‌క్తికి రూ 1.78 ల‌క్ష‌ల‌కు శిశువ‌ను అమ్మేశారు. చట్టబద్దత లేకుండా కన్నతల్లి కూడా బిడ్డల్ని ఎవ్వరికి ఇవ్వకూడదు. అంటే అమ్మకూడదు. ఎవరికన్నా దత్తత ఇవ్వాలన్నా దానికి కూడా చట్టబద్దత ఉండాల్సిందే. కానీ ఆమె మాత్రం ఎలాంటి చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన లాంఛ‌నాలు చేయ‌కుండానే బిడ్డను అమ్మేయటంతో అదికాస్తా నేరమైంది. బిడ్డను అమ్మిందనే స‌మాచారం అందడంతో సదరు మహిళపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆమెతో పాటు ఆమెకు సహకరించినవారితో పాటు శిశువు కొన్న వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.