మద్యానికి బానిసై కన్నబిడ్డను అమ్మేసిన తండ్రి

  • Published By: srihari ,Published On : May 24, 2020 / 12:50 PM IST
మద్యానికి బానిసై కన్నబిడ్డను అమ్మేసిన తండ్రి

మద్యం వ్యసనం పేగు బంధాన్ని తెంపుకునేలా చేసింది. తాగేందుకు డబ్బులు లేవని కన్నబిడ్డనే అమ్మకానికి పెట్టాడు ఓ కసాయి తండ్రి. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారం బతుకమ్మ బండ బస్తీకి చెందిన సింగ్, సరిత భార్యాభర్తలు. తండ్రి సింగ్ నెలన్నర చిన్నారిని.. లాల్ సాబ్ గూడకు చెందిన శేషుకు అమ్మేశాడు. 

రూ.22 వేలకు నెల రోజుల శిశువును విక్రయించారు. సింగ్ ..తన భార్యకు తెలియకుండా శిశువును తీసుకెళ్లి రాత్రి 11 గంటలకు శేషుకు అప్పగించారు. చిన్నారిని బ్యాగ్ లో వేసుకుని శేషు సికింద్రాబాద్ కు వెళ్లాడు. చిన్నారి కోసం సరిత ఉదయం భర్తను ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

స్థానికులు, పోలీసులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు శేషును అదుపులోకి తీసుకున్నారు. తల్లి సరితకు చిన్నారిని అప్పగించారు. చిన్నారి తండ్రి సింగ్ తోపాటు చిన్నారిని కొన్నవారిని పోలీసులు విచారిస్తున్నారు.