అర్నాబ్ గోస్వామికి బెయిల్ నిరాకరణ

For Arnab Goswami, High Court Refuses Bail రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్ణబ్‌ గోస్వామికి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. 2018లో ఓ ఇంటీరియర్‌ డిజైనర్, అతని తల్లిని ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలపై గత వారం అర్నాబ్‌ గోస్వామిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.



అయితే, తన అరెస్టు అక్రమమని పేర్కొంటూ అర్నాబ్ గోస్వామి మధ్యంతర బెయిల్‌ కి ధరఖాస్తు చేసుకున్నా శుక్రవారం ఆయనకు బెయిల్‌ లభించలేదు. మధ్యంతర బెయిల్‌పై శనివారం వాదనలు విన్న న్యాయస్థానం ఈ అంశంపై తీర్పును రిజర్వు చేసింది.

తాజాగా ఈ కేసులో అర్నాబ్ కి బెయిల్‌ ఇచ్చేందుకు బాంబే హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేని సోమవారం(నవంబర్-9,2020)కోర్టు స్పష్టం చేసింది.



కాగా, అర్ణాబ్‌ ని తొలుత జైలు క్వారంటైన్‌ సెంటర్‌లో ఉంచారు. అయితే, జ్యుడిషియల్‌ కస్టడీలో ఆయన మొబైల్‌ ఫోన్‌ వాడుతున్నట్లు సమాచారం రావడం వల్ల ఆదివారం ఆయనను తలోజా జైలుకు తరలించారు.

అయితే,జైలులో తాను దాడికి గురయ్యానని,తనను కుటుంబసభ్యులని కూడా కలిసే అవకాశం లేకుండా చేస్తున్నారంటూ అర్నాబ్ గోస్వామి ఆరోపించిన నేపథ్యంలో ఈ విషయంలో జోక్యం చేసుకున్న మహారాష్ట్ర గవర్నర్…ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ కి ఇవాళ ఉదయం ఫోన్ చేసి మాట్లాడారు. అర్నాబ్ ఆరోగ్యం,సెక్యూరిటీ విషయమై హోంమంత్రితో గవర్నర్ మాట్లాడారు.

ట్రెండింగ్ వార్తలు