బురద గుంత నుంచి బయటకు తీసినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఏనుగు పిల్ల.. వీడియో వైరల్.. ఫిదా అవుతున్న నెటిజన్లు..

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయ్‌గఢ్ జిల్లాలోని చిల్కాగూడ గ్రామ సమీపంలో ఓ లోతైన బురద గుంతలో ఏనుగు పిల్ల పడిపోయింది.

baby elephant

Chhattisgarh: ఆపదలో ఉన్నవారిని రక్షించినప్పుడు వారు కృతజ్ఞతలు చెప్పడం మనం చూస్తూనే ఉంటాం. పలు సందర్భాల్లో జంతువులు కూడా మనుషుల వలే కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శిస్తుంటాయి. తాజాగా.. ఓ ఏనుగు పిల్ల కూడా అదేవిధంగా ప్రవర్తించింది. ఆపద నుంచి రక్షించిన అటవీ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఏనుగు పిల్ల ప్రవర్తనకు ఫిదా అవుతున్నారు.

 

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయ్‌గఢ్ జిల్లాలోని చిల్కాగూడ గ్రామ సమీపంలో ఓ లోతైన బురద గుంతలో ఏనుగు పిల్ల పడిపోయింది. ఘర్‌ఘోడా అటవీ ప్రాంతంలో తిరుగుతున్న ఓ ఏనుగుల గుంపులో భాగమైన ఏనుగు పిల్ల ప్రమాదవశాత్తూ అందులో పడిపోయింది. బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవటంతో పెద్దెత్తున ఆర్తనాదాలు చేసింది. ఏనుగు పిల్ల అరుపులతో స్థానికులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో దానిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేశారు.

 

గ్రామస్తులు, అటవీ అధికారులు జేసీబీ యంత్రాన్ని ఉపయోగించి 50గంటల తరువాత ఏనుగు పిల్లను బయటకు తీశారు. లోతైన గుంతకు ఓవైపు మట్టిని తవ్వి ఏనుగు పిల్ల బయటకు వచ్చేందుకు మార్గం ఏర్పర్చారు. దీంతో ఏనుగు పిల్ల నడుచుకుంటూ బయటకు వచ్చింది. పైకి ఎక్కే సమయంలో హృదయపూర్వక కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శించింది. జేసీబీని తన తొండంతో తాకుతూ కృతజ్ఞతలు తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఏనుగు పిల్ల ప్రవర్తనకు ఫిదా అవుతున్నారు.