ఎంజాయ్ చేయండి…స్కై సైక్లింగ్ పార్క్ రెడీ

పర్యాటకుల స్వర్గధామం  హిమాచల్ ప్రదేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చుట్టూ కొండలు,ఆహ్లాదకరమైన వాతావరణం,ప్రకృతి అందాలతో పర్యాటకులను ఎంతో ఎట్రాక్ట్ చేసే హిమాచల్ ప్రదేశ్ లో…ఇప్పుడు పర్యాటకుల కోసం ఓ స్కై సైక్లింగ్ పార్కు రెడీ అయింది.

 ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మనాలీలోని గులాబా ఏరియాలో ఫారెస్ట్ అధికారుల బృందం, అటవీ బిహారీ వాజ్‌పేయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెయినీరింగ్, అలైడ్ స్పోర్ట్స్ సంయుక్తంగా స్కై సైక్లింగ్ పార్కును ఏర్పాటు చేసినట్లు కులు డివిజన్ పారెస్ట్ ఆఫీసర్ నీరజ్ చాడా తెలిపారు. పర్యాటకులు, సందర్శకులకు అద్భుతమైన అనుభూతిని కలిగించేలా భూమికి 9వేల అడుగుల ఎత్తులో స్కై సైక్లింగ్ పార్కు సిద్దమయిందని, మరో 15 రోజుల్లో పర్యాటకుల కోసం ప్రారంభం కానుందని నీరజ్ చాడా తెలిపారు.