తమిళనాడులో ఆపరేషన్ ఆకర్ష్ : బీజేపీలో టీమిండియా మాజీ క్రికెటర్

Former Indian cricketer Laxman Sivaramakrishnan : దేశంలోని పలు రాష్ట్రాల్లో పాగా వేసిన బీజేపీ..మరికొన్ని రాష్ట్రాలపై పట్టు సాధించేందుకు రెడీ అవుతోంది. అందులో భాగంగా బీజేపీ పక్కా వ్యూహాలు రచిస్తోంది. వచ్చే కొద్ది నెలల్లో జరుగబోయే రాష్ట్రాల్లో బీజేపీ అధిష్టాన పెద్దలు మకాం వేస్తున్నారు. అందులో భాగంగా…వివిధ పార్టల్లో ఉన్న నేతలను ఆకర్షించేప్రయత్నం చేస్తోంది. ప్రధానంగా..దక్షిణాన రాష్ట్రాల్లో కీలకంగా ఉన్న తమిళనాడులో అధికారం చేజిక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. త్వరలోనే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

టీమిండియా మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ ఇన్ ఛార్జీ సీటీ రవి సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. నటుడు రజనీకాంత్ పై పలు కామెంట్స్ చేశారు సీటీ రవి. ఆయన గొప్ప నాయకుడని, తాము ఆయన్ను గౌరవిస్తామన్నారు. ఇక క్రికెటర్ లక్ష్మణ్ విషయానికి వస్తే…1982, 1983 భారత జట్టులో లెగ్ స్పిన్నర్ గా ఉన్నారు. 9 టెస్ట్ మ్యాచ్ లు ఆడారు. 130 రన్లు సాధించారు. టెస్ట్ కెరీర్ లో 24 వికెట్లు తీశాడు. ఫస్ట క్లాస్ క్రికెట్ లో 76 మ్యాచ్ లు ఆడిన ఇతను…1, 802 పరుగులు, 254 వికెట్లు తీశాడు. రాజకీయ, ఇతర రంగాలకు చెందిన వారి చేరికలతో తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ పట్టు సాధిస్తుందా ? కాషాయజెండా ఎగురవేస్తుందా అనేది చూడాలి.