Chitra Ramakrishna Remand : ఎన్‌ఎస్‌ఈ మాజీ ఎండీ చిత్రా రామకృష్ణకు 14 రోజుల రిమాండ్.. వీఐపీ ఖైదీగా పరిగణించేందుకు నిరాకరణ

నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌ కో-లోకేషన్‌ కేసులో సీబీఐ 2018 నుంచి దర్యాప్తు చేస్తోంది. చిత్రా రామకృష్ణన్‌ సీఈవోగా ఉన్నకాలంలో NSEలో అవకతవకలపై విచారణ జరుపుతోంది.

Chitra Ramakrishna remanded : నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌ మాజీ ఎండీ చిత్రా రామకృష్ణకు ఢిల్లీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కోర్టులో విచారణ సందర్భంగా చిత్రా రామకృష్ణను వీఐపీ ఖైదీగా పరిగణించాలని ఆమె తరుపు లాయర్లు కోరారు. ఇందుకు నిరాకరించిన ఢిల్లీ కోర్టు… సాధారణ ఖైదీలా పరిగణిస్తామని స్పష్టం చేసింది. దీంతో పాటు హోం ఫుడ్‌ అనుమతించాలన్న విజ్ఞప్తిని కూడా కోర్టు తిరస్కరించింది.

నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌ కో-లోకేషన్‌ కేసులో సీబీఐ 2018 నుంచి దర్యాప్తు చేస్తోంది. చిత్రా రామకృష్ణన్‌ సీఈవోగా ఉన్నకాలంలో NSEలో అవకతవకలపై విచారణ జరుపుతోంది. ఓ హిమాలయ యోగి ఆదేశాల మేరకు పనిచేశారని… కీలక సమాచారాన్ని లీక్‌ చేశారని, అనర్హులకు పదవులిచ్చారని ఆమెపై పలు ఆరోపణలున్నాయి. మెయిల్‌ రూపంలోనే చిత్రకు, అజ్ఞాత బాబాకు మధ్య సంభాషణలు జరిగాయని.. ఆయన చెప్పిన ప్రాజెక్టులపైనే చిత్రా రామకృష్ణ సంతకాలు చేసినట్లు సీబీఐ విచారణలో తేలింది.

Chitra Ramakrishna : చిత్రా రామకృష్ణ విచారణలో కీలక విషయాలు వెల్లడి

దీంతో ఆమెపై 2018 మేలో కేసు నమోదైంది. విచారణలో చిత్రా రామకృష్ణ సరైన సమాధానాలు ఇవ్వలేదని సీబీఐ అధికారులు తెలిపారు. ముందస్తు బెయిల్‌ కోసం చేసుకొన్న దరఖాస్తును సీబీఐ ప్రత్యేక కోర్టు ఇప్పటికే కొట్టేసింది. అదే రోజు ఆమెను అదుపులోకి తీసుకున్నారు అధికారులు.

ట్రెండింగ్ వార్తలు