రాజకీయాల్లోకి అంటే మా ఆవిడ వదిలేస్తానని వార్నింగ్ ఇచ్చింది

  • Publish Date - April 26, 2019 / 09:45 AM IST

సంచలన నిర్ణయాలతో సుపరిచితుడైన మాజీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ రాజకీయాల్లోకి వచ్చే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబానికి జీవితాన్ని కేటాయించాలని అనుకుంటున్నానని, రాజకీయాల్లోకి వెళ్లొద్దని తన భార్య తనను కోరిందని, ఒకవేళ తన మాట వినకుండా రాజకీయాల్లోకి వెళ్తే తనను వదిలేస్తానని భార్య తెగేసి చెప్పినట్లు రఘురామ్ రాజన్ చెప్పుకొచ్చారు. బలమైన కారణం ఏదీ లేనప్పటికీ తనకు కూడా రాజకీయాలపై ఎటువంటి ఆసక్తి లేదని, అధ్యాపకుడిగా చేస్తున్న ఉద్యోగంలో సంతోషంగా ఉన్నట్లు చెప్పారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ పథకం(న్యాయ్)తో కొంతమేర ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉందనిచ, పేదలకు నగదు అందజేయడం వల్ల వారికి కావాల్సినవి వారే కొనుగోలు చేసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయంలో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా రాజన్ పనిచేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు