Amritsar massive fire
Amritsar : పంజాబ్ రాష్ట్రంలో అమృత్‌సర్ నగరంలోని ఫార్మాస్యుటికల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. మాజితారోడ్డులోని ఫ్యాక్టరీలో కెమికల్ దగ్ధమైంది. ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున నిల్వ ఉన్న కెమికల్ అగ్ని కీలల్లో చిక్కుకుంది.
Also Read : Mumbai : ముంబయి భవనంలో అగ్నిప్రమాదం..ఏడుగురి మృతి, 40మందికి గాయాలు
అగ్నిప్రమాదం జరిగినపుడు కార్మికులు లోపల పనిచేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో నలుగురు మరణించారు. అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు.