Pune Accident : పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం…నలుగురి మృతి, ఇద్దరికి గాయాలు

మహారాష్ట్రలోని పూణే నగరంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణెలో సోమవారం రాత్రి ట్రక్కు ఢీకొనడంతో మంటలు చెలరేగడంతో ఇద్దరు మైనర్‌లతో సహా నలుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు....

Pune Accident : మహారాష్ట్రలోని పూణే నగరంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణెలో సోమవారం రాత్రి ట్రక్కు ఢీకొనడంతో మంటలు చెలరేగడంతో ఇద్దరు మైనర్‌లతో సహా నలుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పూణె-బెంగళూరు హైవేపై స్వామినారాయణ దేవాలయం, నవ్లే వంతెన సమీపంలో రాత్రి 9.30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా ట్రక్కు కంటైనర్‌ను ఢీకొట్టిందని, ఆపై మరో ట్రక్కును ఢీకొట్టిందని, ఆ తర్వాత మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు.

Also Read : Manipur : మణిపూర్ కేసులో ఆరుగురిపై సీబీఐ చార్జిషీట్

ఈ ప్రమాద ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పూణె మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాలిపోతున్న ట్రక్కులో నుంచి బాధితుల మృతదేహాలను తొలగించి ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగినప్పుడు ట్రక్కులో ఆరుగురు ఉన్నారని పోలీసులు తెలిపారు.

Also Read : Bihar : బీహార్ రాష్ట్రంలో మళ్లీ పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

ట్రక్కులో ఉన్న వారిలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు ట్రక్కు నుంచి దూకి తప్పించుకోగలిగారు. వారు కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారని పోలీసులు చెప్పారు. అయితే మృతులను ఇంకా గుర్తించలేదని వారు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు