road accident (1)
Karnataka Road Accident : కర్ణాటకలో జరిగిన ఘెర ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. చిక్ బళ్లాపూర్ లో కారు అదుపుతప్పి చెరువులో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. చిక్ బళ్లాపూర్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు తెలియాల్సివుంది.
కాగా, అక్టోబర్ నెలలో చిక్ బళ్లాపూర్ 44వ జాతీయ రహదారిపై కారు ట్రక్కును ఢీకొనడంతో 13 మంది మృతి చెందారు. చిక్ బళ్లాపూర్ శివారులోని బెంగళూరు-హైదరాబాద్ హైవేపై రోడ్డు పక్కన ఆగి ఉన్న సిమెంట్ మిక్సర్ లారీని మల్టీ యుటిలిటీ వెహికల్ (ఎంయూవీ) ఢీకొట్టింది.
దీంతో ఆరేళ్ల బాలుడు, నలుగురు మహిళలు, పీయూ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి సహా 13 మంది మృతి చెందారు. బెంగళూరు నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిక్కబళ్లాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
చిత్రావతి జంక్షన్ వద్ద ఉదయం 6.30 గంటలకు 12 మంది ప్రయాణికులతో వెళ్తున్న టాటా సుమో, సిమెంట్ మిక్సర్ లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.