ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా మోడీ ఫోటో ఉన్న టిక్కెట్లను అమ్మవద్దంటూ ఇప్పటికే పలు రవాణా సంస్థలకు ఈసీ నోటీసులు జారీ చేసింది.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా మోడీ ఫోటో ఉన్న టిక్కెట్లను అమ్మవద్దంటూ ఇప్పటికే పలు రవాణా సంస్థలకు ఈసీ నోటీసులు జారీ చేసింది. అయితే నిబంధనలు ఉల్లఘించి అమ్మిన రైల్వే అధికారులు సస్పెండ్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకీ రైల్వేస్టేషనులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also : మరలా బాబే సీఎం : YCP అరాచకాన్ని అణిచివేస్తాం – బుద్ధా
ఏప్రిల్ 13వ తేదీన బారాబంకీ రైల్వేస్టేషను బుకింగ్ కౌంటరులో ఇద్దరు బుకింగ్ క్లర్కులు రైలు టికెట్లను అమ్మారు. అయితే ఆ టిక్కెట్ల వెనుక నరేంద్ర మోడీ ఫోటో ఉంది. దీంతో ప్రయాణికులు ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేయగా.. వారు రైల్వే అధికారులను వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. దీనిపై స్పందించిన రైల్వే అధికారులు.. ఇద్దరు రైల్వే బుకింగ్ క్లర్కులు పొరపాటున పాత టికెట్ల రోల్‌ను వాడారని రైల్వే ఉన్నతాధికారుల దర్యాప్తులో తేలినట్లు చెప్పారు.దీంతో దీనికి కారణమైన నలుగురు రైల్వే ఉద్యోగులను సస్పెండ్ చేశామని తెలిపారు.
ఇదిలా ఉంటే అంతకుముందు ఈ విషయాన్ని ఎన్నికల కోడ్‌కు విరుద్దమని రిజ్వీ అనే యువకుడు అధికారులకు ఫిర్యాదు చేయగా.. ఫిర్యాదును తీసుకోకుండా అతనిని బయటకు నెట్టేశారు. చివరకు రిజ్వీ సోషల్ మీడియాలో పెట్టడంతో అధికారులు దారిలోకి వచ్చారు.
Read Also : రాజకీయాల్లో మర్యాద : శశిథరూర్‌కి నిర్మలా సీతారామన్ పరామార్శ