బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

ఢిల్లీ మహిళలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుభవార్త అందించారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు.

  • Publish Date - August 29, 2019 / 03:38 PM IST

ఢిల్లీ మహిళలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుభవార్త అందించారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు.

ఢిల్లీ మహిళలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుభవార్త అందించారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. 2019, అక్టోబర్ 29 వ తేది నుంచి ఢిల్లీ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (డీటీసీ) బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లాట్ తెలిపారు. గురువారం (ఆగస్టు 29, 2019)వ తేదీన కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపినట్లు గహ్లాట్ చెప్పారు. 

డీటీసీతోపాటు క్లస్టర్ బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. ఉచిత పాసులు బస్సు కండక్టర్ దగ్గర అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఒక వేళ ఉచితంగా ప్రయాణించడం ఇష్టం లేని మహిళలు టికెట్ కూడా తీసుకొచ్చన్నారు గహ్లాట్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు గానూ రూ.140 కోట్ల నిధులను కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019, ఆగస్టు 15వ తేదీన రక్షాబంధన్ పండుగ రోజున మహిళలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేక కానుక ప్రకటించారు. ఢిల్లీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.

అంతేకాదు ఢిల్లీలో ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు గతంలో ఢిల్లీ సీఎం ప్రకటించారు. నగరవాసులకు ప్రతి నెలా 15 జీబీ డేటాను అందిస్తామని.. అందుకోసం నగర వ్యాప్తంగా 11 వేల హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. మరో 4 నాలుగు నెలల్లో ఈ ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.