Manikandan: మాజీ మంత్రిపై కేసు.. రూ.10కోట్లు కోరుతూ కోర్టులో పిటిషన్‌!

తమిళనాడులో మంత్రిపై ఆరోపణలు సంచలనంగా మారాయి. తనను మోసం చేశారంటూ అన్నాడీఎంకేకు చెందిన నాయకుడు, మాజీమంత్రి మణికంఠన్‌పై స్థానిక బీసెంట్‌నగర్‌కు చెందిన మలేషియాకు చెందిన సినీనటి చాందినీ కోర్టులో పిటీషన్ దాఖలు చేూశారు.

Former Minister Manikandan: తమిళనాడులో మంత్రిపై ఆరోపణలు సంచలనంగా మారాయి. తనను మోసం చేశారంటూ అన్నాడీఎంకేకు చెందిన నాయకుడు, మాజీమంత్రి మణికంఠన్‌పై స్థానిక బీసెంట్‌నగర్‌కు చెందిన మలేషియాకు చెందిన సినీనటి చాందినీ కోర్టులో పిటీషన్ దాఖలు చేూశారు. అంతకుముందే పెళ్లి చేసుకుంటానని నమ్మించి, సహజీవనం చేసి మోసం చేశారని పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో నటి చాందిని ఫిర్యాదు చేసింది.

ఈ కేసు నడుస్తుండగానే మణికంఠన్‌ తనకు నష్టపరిహారంగా రూ.10కోట్లు చెల్లించాలంటూ స్థానిక సైదాపేట కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసు వ్యవహారంలో పోలీసులు మాజీ మంత్రి మణికంఠన్‌ను అరెస్టు కూడా చేశారు. ప్రస్తుతం మద్రాసు హైకోర్టులో విచారణలో ఉన్న ఈ కేసుపై వచ్చే నెల 5వ తేదీన విచారణ జరగనుంది.

ఈ క్రమంలోనే తాను చెన్నైలో ఉండి కోర్టు కేసు వ్యవహారాలను చూసుకోవాల్సి ఉందని, అందుకు తనకు అయ్యే నెలవారి ఖర్చులు కూడా మాజీ మంత్రే చెల్లించాలని పిటిషన్‌లో కోరారు.

ట్రెండింగ్ వార్తలు