Madhya Pradesh Full Lockdown : మధ్యప్రదేశ్‌లో జూన్ 15 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో పూర్తి లాక్ డౌన్ జూన్ 15వ తేదీ వరకు పొడిగించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై భోపాల్‌లో మంత్రివర్గ సమీక్ష జరిగింది. ఈ సమీక్ష అనంతరం లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్టు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు.

Madhya Pradesh Full Lockdown

Madhya Pradesh Full Lockdown : మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో పూర్తి లాక్ డౌన్ జూన్ 15వ తేదీ వరకు పొడిగించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై భోపాల్‌లో మంత్రివర్గ సమీక్ష జరిగింది. ఈ సమీక్ష అనంతరం లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్టు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా కర్ఫ్యూను సడలింపులతో పొడిగించినట్టు పేర్కొన్నారు. ఉజ్జయిన్‌లోని మార్కెట్లు రాత్రి 7 గంటల వరకూ తెరిచి ఉండనున్నాయి.

ఖర్గావ్‌లో మాత్రం సరి-బేసిలో షాపులు తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. శివపురిలో షాపులను రోజువిడిచి రోజు తెరుచుకునేందుకు అనుమతించారు. మార్కెట్లు ఓపెన్ చేయాలంటే వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ క్యాంపెయిన్ నిర్వహించింది. షాపుల యజమానుల్లో వ్యాక్సినేషన్‌ కోసం ప్రభుత్వం వివిధ ట్రేడ్ యూనియన్లతో క్యాంపెయిన్ ప్రారంభించింది. రాష్ట్రంలోని 46 జిల్లాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు సడలించారు.

కొవిడ్ పరిస్థితిని అంచనా వేసేందుకు జూన్ 8 వరకూ లాక్‌డౌన్ పొడిగించాలని గతంలో మే 31న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భోపాల్‌లో వీకెండ్ కర్ఫ్యూ కొనసాగుతోంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ నైట్‌ కర్ఫ్యూ కొనసాగుతోంది. స్విమ్మింగ్ ఫూల్స్, జిమ్స్, తదితరాలకు ఆంక్షల సడలింపులు వర్తించవు. హోటల్స్‌లో టేక్ఎవే మాత్రమే అనుమతి ఉంది.