‘ఆటోమేషన్‌’తో ఉద్యోగాలకు ఎసరు

  • Publish Date - February 4, 2019 / 02:49 AM IST

ఢిల్లీ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకు మారిపోతోంది. ఆయా రంగాల్లో మానవ వనరులు తక్కువై పోతున్నాయి. హై టెక్నాలజీ ఉద్యోగాలకు ఎసరు పెడుతోందని అంచనా. యాస్పైరింగ్ మైండ్స్ అనే సంస్థ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ -2018 పేరిట ఓ నివేదిక రూపొందించింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ అండ్ రోబోటిక్స్‌దేనని వెల్లడించింది. 

ఆటో మెషిన్ కారణంగా ఢిల్లీలో అత్యధికంగా 45.1 శాతం, తెలంగాణలో 37.5 శాతం, ఏపీలో 37.2 శాతం ఉద్యోగాలు పోయాయని నివేదిక పేర్కొంది. ఏఐ, రోబోటిక్స్‌తో నూతన శకం రాబోతోందని అంచనా వేసింది. ఐటీ, సాఫ్ట్ వేర్ రంగాల్లో సుమారు 42 శాతం ఆటోమేషిన్ ప్రభావం ఉండొచ్చని అంచనా వేసింది. సివిల్, మెకానికల్ వంటి సబ్జెక్టుల కోర్ ఇంజినీరింగ్ చదివిన వారికి 7 శాతమే జాబ్స్ లభిస్తాయని నివేదిక వెల్లడించింది. లేబర్ మార్కెట్‌లోని 30 రకాల ఉద్యోగాల్లో మానవ నైపుణ్యాలకు అధిక డిమాండ్ ఉంటుందని, బిజినెస్ అభివృద్ధి, ఆదాయ వృద్ధిలో, సేల్స్ రంగంలో 12 శాతం ఉద్యోగాలు లభిస్తాయని నివేదిక అంచనా వేసింది. కస్టమర్ సర్వీస్‌లో ఆటో మెషిన్ పాత్ర మరింత పెగుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. 2020 నాటికి 85 శాతం మేర ఆటోమేషిన్ ప్రక్రియ ద్వారానే కస్టమర్ ఇంటరాక్షన్ జరుగుతుందని వెల్లడించింది. అకౌంటింగ్స్, బ్యాంకింగ్ రంగాల్లో మరింత ఈ విధానం మరింత పెరుగుతుందని తెలిపింది.