Gold Utensils For G20 Summit 2023
Gold Utensils – G20 Summit 2023 : జీ20 సదస్సుకు భారత్ (India)ఆతిథ్యమిస్తోంది. 2023 సంవత్సరానికి గానూ ప్రతిష్ఠాత్మకమైన జీ20 శిఖరాగ్ర సదస్సుకు వేదికైన భారత్.. ఆయా దేశాధి నేతల కోసం భారీ ఏర్పాట్లు చేసింది. దేశాధి నేతలకు ఇచ్చే విందును కూడా భారత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జీ20 సదస్సు దేశాధినేతలకు విందు వడ్డించే ప్లేట్ల నుంచి.. సర్వింగ్ పాత్రల వరకు అంతా గ్రాండ్ గా ఉండేలా ఏర్పాట్లు చేసింది భారత్.దేశాధినేతలకు బంగారం, వెండి వంటి పాత్రల్లో విందు వడ్డించనున్నారు. ఇవి కేవలం పాత్రలే కాదు వాటికి విశిష్టతలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. జీ20 సదస్సుకు వచ్చే దేశాధి నేతల కోసం భారత ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు చూస్తుంటే ఔరా అనిపిస్తున్నాయి. భారతీయ సంప్రదాయంతో పాటు హుందాతనాన్ని ఈ విందులో ప్రతిబింభిచేలా ఏర్పాట్లు చేశారు.
ఈ బంగారు, వెండి వంటి పాత్రల్ని 200లమంది కళాకారులు రూపొందించారు. ఈ పాత్రలు తయారు చేయటానికి ప్రభుత్వం ఓ సంస్థకు కాంట్రాక్టు అప్పగించినట్లుగా తెలుస్తోంది.జైపూర్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలతో సహా భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన హస్తకళాకారులు పనితనం ఈ పాత్రల్లో కనిపిస్తోంది. దేశాధి నేతల విందులో ఉపయోగించే ఈ బంగారు,వెండి పాత్రల్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. 50,000 గంటలు కష్టం..200లమందికి పైగా కళాకారులు తయారు చేశారు. ఈ పాత్రల్లో 15,000 వెండి వస్తువులు ఉన్నాయి.
Biden Delhi visit : ఢిల్లీలో జో బిడెన్ పర్యటన సందర్భంగా బుల్లెట్ ప్రూఫ్ బీస్ట్.. మూడంచెల భద్రత
విందుకు తయారు చేయించిన పాత్రలు చూస్తుంటే రాజసం ఉట్టిపడుతోంది. రాజుల కాలంలో మహారాజులు, చక్రవర్తులు విందు ఆరగించినట్లుగా అనిపిస్తున్నాయి. సాధారణంగా ఇతర దేశాల్లో ప్రతినిధులకు ఏర్పాటు చేసే విందులో పింగాణీ, గ్లాస్‌లతో తయారు చేసిన పాత్రలు కనిపిస్తుంటాయి. కానీ భారత్ ఇచ్చే విందు మాత్రం పూర్తి భిన్నంగా ఉంటోంది. ఓ పక్క దేశ సంప్రదాయం, మరో పక్క హుందాతనం, రాజసం ఉట్టిపడేలా బంగారం, వెండితోనే తయారు చేసిన పాత్రలు కనిపిస్తున్నాయి.
జీ20 సదస్సు నేతల విందు కోసం తయారు చేసిన ఒక్కో పాత్రకు ఒక్కో విశిష్టత ఉందని తయారీ దారులు చెబుతున్నారు. వీటి తయారీ కోసం వారు పలు రాష్ట్రాల్లో పర్యటించారట. ప్రతీ పాత్ర తయారీలోని భారత సంప్రదాయం ఉండేలా రూపొందించామని చెబుతున్నారు. దేశంలోని ఆయా ప్రాంతాల సంప్రదాయాలనుకూడా పాత్రల తయారీలో ఉపయోగించారు. దాంట్లో భాగంగానే దక్షిణ భారతంలో పర్యటించి అరిటాకు భోజనాన్ని పాత్రల్లో రూపొందించారు. అరిటాకు డిజైన్ ఉన్న కంచాన్ని తయారు చేశారు.
అలాగే మన జాతీయ పక్షి నెమలి ఆకృతిలో మంచినీరు సర్వ్ చేసే పాత్రలు రూపొందించారు. పానీయ పాత్రలపై పువ్వులు, లతల డిజైన్ ను రూపొందించారు. అలాగే పండ్లు అందించేందుకు నెమలి పింఛం ఆకృతిలో ప్లేట్ రెడీ చేశారు. ఓ వెండి కంచెంలో భారత జాతీయ చిహ్నం మూడు సింహాలను ముద్రించారు. అతిథుల్ని దైవంగా భావించే భారత సంప్రదాయం ఈ సదస్సుకు విచ్చేసే విదేశీ అతిథ్యంలో ప్రస్పుటంగా ఉండేలా రూపొందించారు. బంగారు, వెండి పాత్రలు,బంగారు గిన్నెలు, స్పూన్లు ఇలా ప్రతీ అంశంలోను రాజసం ఉట్టిపడేలా భారత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
#WATCH | CEO IRIS India, Rajeev Pabuwal says, “We started this (preparations) in January 2023…We have made cutlery according to the location…We have incorporated the cutlery according to the state’s culture…Some cutlery is silver coated…We have also made a ‘Maharaja… pic.twitter.com/bxxma7ouqL
— ANI (@ANI) September 6, 2023