Mamata Banerjee: ఆట అయిపోలేదు.. బీజేపీకి మమతా వార్నింగ్

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రీసెంట్ గా విడుదలైన అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీపై కామెంట్ చేశారు. ప్రెసిడెన్షియల్ పోల్స్ ముందున్నాయని, వాటిని ఎదుర్కోవడం పార్టీకి అంత ఈజీ కాదని..

Mamata Benerjee

Mamata Banerjee: వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రీసెంట్ గా విడుదలైన అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీపై కామెంట్ చేశారు. ప్రెసిడెన్షియల్ పోల్స్ ముందున్నాయని, వాటిని ఎదుర్కోవడం పార్టీకి అంత ఈజీ కాదని సూచించారు. బీజేపీలో దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం శాసనసభ్యుల సంఖ్యలో సగం కూడా లేరంటూ విమర్శించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా సమాజ్ వాద్ పార్టీకి గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలే దక్కాయని పోల్చారు.

‘ఈ సారి బీజేపీకి ప్రెసిడెన్షియల్ ఎన్నికలు అనుకున్నంత ఈజీ కాదు. దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలలో వారికి సగం కూడా లేరు. ప్రతిపక్షాలన్నీ కలిస్తే ఇంకా ఎక్కువ మందే ఉంటారు’ అని అసెంబ్లీలో స్పష్టం చేశారు.

Read Also: మమతా బెనర్జీ సంచలన ప్రకటన

‘గేమ్ అప్పుడే అయిపోలేదు. గత ఎన్నికల్లో ఓడిపోయిన సమాజ్‌వాదీ పార్టీలో ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిందని’ తెలిపారు.

పార్లమెంటు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసన సభలలో ఎన్నికైన సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ప్రెసిడెన్షియల్ ఎన్నికలు నిర్వహిస్తారు.

రీసెంట్ గా కాంగ్రెస్, తృణమూల్ పార్టీలకు చెందిన ఇద్దరు కౌన్సిలర్ల హత్యల గురించి మాట్లాడిన మమతా.. రాజకీయ జోక్యం లేకుండా దర్యాప్తు జరుగుతుందని త్వరలోనే దోషులు బయటికొస్తారని చెప్పారు. మమతా స్పీచ్ జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష పార్టీ బీజేపీ నేతలు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.

UP : యూపీలో మమతకు షాక్.. నల్లజెండాలతో నిరసన