పాక్‌లో ఉన్న హిందువులు, సిక్కులు భారత్‌కు రావొచ్చని గాంధీజీ చెప్పారని, వీరందరికీ మెరుగైన జీవితం అందించడం భారతదేశ బాధ్యత అని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. CAAతో బాపుజీ కల నేరవేరిందని వెల్లడించారు. 2020, జనవరి 31వ తేదీ శుక్రవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పాకిస్తాన్..ఆ దేశంలో మైనార్టీలను టార్గెట్ చేసిందని, నన్ కానా షాహిబ్ ఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
వ్యాలీలో వివిధ విద్యా సంస్థలు ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల్లో కనెక్టివిటీని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గిరిజనుల కోసం అనేక పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చిందని, బోడో సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చకున్న విషయాన్ని ఆయన సభలో వెల్లడించారు. ఇంటికి నీటి సరఫరా లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, లక్షలాది కుటుంబాల సమస్యలు తీర్చడానికి జల్ జీవన్ మిషన్ పనిచేస్తోందని చెప్పారు.
తమ ప్రభుత్వ విజ్ఞప్తితో సౌదీ ప్రభుత్వం హజ్ కోటాను పెంచిందని, దీనివల్ల 2 లక్షల మంది భారతీయ ముస్లింలు హజ్ యాత్ర చేయగలిగారన్నారు. ఆయుష్మాన్ వల్ల భారత్‌లో 65 లక్షల మందికి మేలు జరిగిందన్నారు.
* మైనార్టీలు, బలహీన వర్గాల ప్రజల కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుంది.
* రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు చర్యలు.
* కిసాన్ సమ్మాన్ నిధితో రూ. 8 కోట్ల మంది రైతులకు లబ్ది.
* రైతుల అకౌంట్లలో రూ. 12 వేల కోట్ల రూపాయలు.
* ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోకుండా బీమా అమలు.
* వైద్య ఆరోగ్య రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం.
* నూతన హెల్త్ కేర్ స్కీంతో 65 లక్షల మందికి లబ్ది.
* ఆయుష్మాన్ భారత్‌తో ప్రజల ఆరోగ్యానికి భరోసా.
Read More : దశాబ్దం ఎంతో కీలకం : పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగం