గాంధీజీ కళ్లద్దాలు…ఎంతకు అమ్ముడయ్యాయో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

మహాత్మాగాంధీజీ వాడిన కళ్లద్దాలను ఎంత రేటు పెట్టి కొన్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. గాంధీజీ వాడిన కళ్లద్దాలను యూరప్‌లో ఈస్ట్ బ్రిస్టల్ సంస్థ వేలంపాటకు పెట్టగా 2 కోట్ల 55 లక్షల 906 రూపాయలకు ఓ వ్యక్తి వీటిని దక్కించుకున్నాడు. ఆరు నిమిషాలపాటూ… ఫోన్ ద్వారా ఈ వేలం జరిపారు.

అమెరికాలో ఇలాంటి అరుదైన వాటిని సేకరించే ఓ వ్యక్తి.. ఈ కళ్లదాల్ని దక్కించుకున్నారు. ఇందుకోసం ఆయన £260,000 పౌండ్లు చెల్లించారు. అంత డబ్బు పెట్టి కొన్నారంటే… ఆయనకు గాంధీజీపై ఎంతటి అభిమానం, అరుదైన వస్తువులపై ఎంత అభిరుచి ఉండి ఉండాలి

వేలాల్లో ఇదో రికార్డ్ అని బ్రిస్టల్ సంస్థ తెలిపింది. ఇన్నాళ్లూ ఈ కళ్లద్దాలు కలిగివున్న వ్యక్తి ముసలాయన అయిపోయారు. ప్రస్తుతం మాంగోస్ట్స్‌ఫీల్డ్‌లో ఉంటున్నారు. కళ్లద్దాల ద్వారా వచ్చిన డబ్బును తన కూతురికి సగం పంచుతానన్నారు. ఈ ఫ్యామిలీకి చెందిన ఒకరు… 1920లో… దక్షిణ ఆఫ్రికాలో గాంధీజీని కలిశారు. అలా గాంధీజీ వాడిన కళ్లద్దాలు ఈ ఫ్యామిలీకి దక్కాయి. అవి చేతులు మారుతూ… ఇప్పుడు అమ్ముడవుతున్నాయి.

50 ఏళ్లుగా ఆ కళ్లద్దాలను ఓ డ్రాయర్‌లో ఓ తెల్లటి ఎన్‌వలప్ కవర్‌లో ఉంచారు. వాటిని అమ్మాలనుకున్నప్పుడు… వాటి ధర రూ.14 లక్షలకు పైగా పలకొచ్చని వేలం సంస్థ చెబితే… ఆ కుటుంబం ఆశ్చర్యపోయింది. అవి అంత రేటు పలుకుతాయా అంది. అలాంటిది… అవి ఏకంగా రెండున్నర కోట్లకు పైగా పలకడంతో… ఇప్పుడా కుటుంబం ఆనందంలో మునిగి తేలుతుంది.