Garba Song : శరన్నవరాత్రుల వేళ.. మోదీ రాసిన ‘గర్బా’ పాట

గుజరాత్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది 'గర్బా'నృత్యం. ప్రధాని నరేంద్ర మోదీ నవరాత్రుల వేళ గర్బా సాంగ్ రాసారు. యూట్యూబ్‌లో రిలీజైన ఈ పాట దుమ్ము రేపుతోంది.

Garba Song

Garba Song : నవరాత్రి వేళ ప్రధాని నరేంద్ర మోదీ రాసిన ‘గర్బా’ సాంగ్ రిలీజైంది. మోదీ చాలా సంవత్సరాల క్రితం రాసిన లిరిక్స్‌ని ధ్వని భానుశాలి పాడగా.. తనిష్క్ బాగ్చి కంపోజ్ చేసారు. 190 సెకండ్ల నిడివి ఉన్న ఈ పాటను సోషల్ మీడియాలో షేర్ చేసారు మోదీ.

Dussehra 2023 : దసరా అంటే అందరికీ సరదానే.. కానీ ఈ పండుగ ఎందుకు చేసుకుంటారో తెలుసా?

అక్టోబర్ 15 నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్న వేళ ప్రధాని మోదీ రాసిన గర్బా సాంగ్ రిలీజైంది. ఈ పాటను మోదీ చాలా సంవత్సరాల క్రితం రాసారాట. ‘గర్బో’ అనే టైటిల్‌తో రూపొందించిన ఈ పాటను ధ్వని భాను శాలి ఆలపించగా తనిష్క్ బాగ్చి స్వరపరిచారు. నటుడు, నిర్మాత జాకీ భగ్నాని సొంత నిర్మాణ సంస్థ జుస్ట్ మ్యూజిక్ బ్యానర్‌పై రిలీజ్ చేసారు. ఈ పాట విడుదలైన గంటల్లోపే మిలియన్ల సంఖ్యలో దూసుకుపోతోంది.

Dussehra 2023: శరన్నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలు.. అలంకరణలు.. విశిష్టతలు

మోదీ ఈ పాటను ట్విట్టర్‌లో షేర్ చేసారు. టీం మొత్తానికి ధన్యవాదాలు చెప్పారు. ‘తాను కొన్ని సంవత్సరాల క్రితం రాసిన గర్బా సాంగ్ అని.. చాలా జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని.. కొన్ని రోజుల క్రితం కొత్త గర్బా రాసానని.. నవరాత్రి వేళ ఇలా పంచుకుంటున్నానని’ మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ రాసిన పాటంటే ఇక జనం చూడకుండా ఉంటారా? సోషల్ మీడియాలో ఈ పాట దూసుకుపోతోంది.