Gas Crisis Charge: ‘రేయ్ ఏంట్రా ఇదంతా..’ నిమ్మకాయ జ్యూస్ కి గ్యాస్ చార్జ్ వేస్తారా.. అది కూడా మరీ ఇంతా..!
ఈ వైరల్ పోస్ట్‌పై పెద్ద సంఖ్యలో నెటిజన్లు స్పందించారు. పుదీనా నిమ్మరసం తయారు చేయడానికి LPG గ్యాస్ వాడటం ఏంటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
- Naveen
- Published On : March 15, 2026 / 07:24 PM IST
Mint Lemonade Representative Image (Image Credit To Original Source)
- బెంగళూరు కేఫ్ లో చిత్రవిచిత్రం
- నిమ్మకాయ జ్యూస్ పై గ్యాస్ క్రైసిస్ చార్జ్ వసూలు
- ఏకంగా 5శాతం (17 రూపాయలు) ఛార్జ్ చేసిన కేఫ్
Gas Crisis Charge: ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం.. భారత్ పై పెను ప్రభావాన్ని చూపుతోంది. యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్రమైన ప్రభావమే చూపించింది. సిలిండర్లు లేక హోటల్స్, రెస్టారెంట్లు మూతపడ్డాయి. ఇదిలా ఉంటే.. గ్యాస్ కొరత కారణంగా చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని హోటల్స్ లో జరుగుతున్న ఘటనలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్థితి కల్పిస్తున్నాయి.
చెన్నైలోని ఒక హోటల్.. గ్యాస్ ఛార్జీ సైతం కస్టమర్ నుంచి వసూలు చేసిందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. దానికి సంబంధించిన బిల్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. సరిగ్గా అలాంటి విచిత్రమైన ఘటన మరొకటి వెలుగుచూసింది. ఏకంగా నిమ్మకాయ జ్యూస్ కి గ్యాస్ చార్జ్ వేసిన వైనం విస్మయానికి గురి చేస్తోంది.
గ్యాస్ క్రైసిస్ చార్జ్ పేరుతో 17 రూపాయలు వసూలు..
అసాధారణ సర్‌ఛార్జ్‌తో కూడిన ఒక కేఫ్ బిల్లు ఎక్స్ లో, రెడ్డిట్‌లో వైరల్‌గా మారింది. @HaramiParindey అనే యూజర్ ఈ బిల్లును షేర్ చేశారు. ఇది బెంగళూరుకు చెందిన ఒక కేఫ్ నుండి ముద్రించిన రసీదు. ఇక్కడ “గ్యాస్ క్రైసిస్ ఛార్జ్” పేరుతో కస్టమర్ల నుంచి అదనంగా రుసుము వసూలు చేస్తున్నారు. బెంగళూరులోని థియో కేఫ్ నుండి ఈ బిల్లు వచ్చింది. రెండు పుదీనా నిమ్మరసాల ధర రూ. 179. టోటల్ రూ. 358. ఇందులో 5శాతం (రూ.17.90) డిస్కౌంట్ ఇచ్చారు. బిల్లులో జీఎస్టీ చార్జ్ కూడా వేశారు. ఇదంతా కామన్. అయితే, అందులో “గ్యాస్ క్రైసిస్ ఛార్జ్” అనే పేరు కూడా ఉంది. దీని కింద అదనంగా 5 శాతం (రూ.17.01) మొత్తాన్ని జోడించారు. అంటే చెల్లించాల్సిన బిల్లు మొత్తం రూ.374. జీఎస్టీ వేశారు ఓకే..కానీ గ్యాస్ క్రైసిస్ చార్జ్ వేయడం ఏంటని నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇదెక్కడి విడ్డూరం అని విస్తుపోతున్నారు.
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో LPG సరఫరా కొరత ఉందని నివేదికలు వెలువడుతున్న సమయంలో “గ్యాస్ క్రైసిస్ ఛార్జ్” వసూలు చేయడం చర్చకు దారితీసింది. నిమ్మకాయ జ్యూస్ కి కూడా గ్యాస్ చార్జ్ వేయడం టూ మచ్ అని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఈ వైరల్ పోస్ట్‌పై పెద్ద సంఖ్యలో నెటిజన్లు స్పందించారు. పుదీనా నిమ్మరసం తయారు చేయడానికి LPG గ్యాస్ వాడటం ఏంటని కొందరు విస్మయం వ్యక్తం చేయగా.. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయాలని మరికొందరు సూచించారు. నిమ్మరసం చేసేందుకు ఎలాంటి గ్యాస్ వాడతారో చెప్పాలని కొందరు నెటిజన్లు ప్రశ్నించారు. అసలు నిమ్మరసం చేసేందుకు ఎల్పీజీ గ్యాస్ వాడాల్సిన అవసరమే లేదన్నారు. నిమ్మకాయలు ఏమైనా వేడి చేసి వాడావా? అని మరొక నెటిజన్ ప్రశ్నించాడు.
“గ్యాస్ స్టవ్ మీద నిమ్మరసం తయారు చేయడం వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం చట్టవిరుద్ధం. ఇంధన కొరత పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేయడం అన్యాయం. ఇందుకు గాను 50000 వరకు జరిమానా చెల్లించాలి” అని మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. ఆ బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేయడానికి బదులుగా.. చట్టవిరుద్ధంగా చార్జ్ చేసిన రెస్టారెంట్ పై అధికారులకు ఫిర్యాదు చేసి ఉండాల్సిందని అని మరొక యూజర్ అభిప్రాయపడ్డాడు.
గ్యాస్ క్రైసిస్ చార్జ్ ని వసూలు చేయడాన్ని తప్పుపట్టే వారే కాదు సమర్థించే వారూ ఉన్నారు. రెస్టారెంట్లు ఈ పన్ను వసూలు చేయడంలో ఎలాంటి తప్పు లేదని ఒక నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో తమ హోటల్, రెస్టారెంట్ మూత పడకుండా ఉండేందుకు విధిస్తున్న ఛార్జీ ఇది. అది సహేతుకమని నేను భావిస్తున్నాను” అని తన అభిప్రాయం తెలిపాడు.
Also Read: కేంద్రం సంచలనం.. వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి.. ఆర్డర్స్ పాస్..
“Gas crisis charge” on a lemonade 🤣
Source: r/bangalore pic.twitter.com/wkAU1QIsNl
— Pakchikpak Raja Babu (@HaramiParindey) March 15, 2026
