దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ 19(కరోనా)వైరస్ వ్యాప్తి నిరోధానికి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 50 మందికి మించి జనం ఒక దగ్గర గూమికూడవద్దని హెచ్చరించారు సీఎం కేజ్రీవాల్.
మతపరమైన, సామాజికపరమైన, సాంస్కృతిక సమావేశాల్లో ఏవైనా నిర్వహిస్తే అక్కడ 50 మందిని మించి జనసమీకరణ ఉండరాదని తెలిపారు. అయితే ముందుగా నిర్ణయించుకున్న పెళ్లిలకు ఈ నియమం వర్తించదని తెలిపారు. స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లను మూసివేస్తున్నట్లు సీఎం చెప్పారు.
క్వారెంటైన్ కోసం మూడు హోటళ్లను గుర్తించామని… డబ్బులు కట్టి ఎవరైనా ఆ హోటళ్లలో ఐసోలేట్ కావచ్చని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలో ఇప్పటివరకు ఏడు కోవిడ్19 కేసులు నమోదు అయ్యాయి. దాంట్లో ఇద్దరికి వ్యాధి నయమైంది. ఒకరు మరణించారు. దేశంలో కోవిడ్19 కేసులు 110కి చేరుకున్నాయి. ఆ జాబితాలో విదేశీయులు కూడా ఉన్నారు.
Delhi CM Arvind Kejriwal: All gyms, night clubs, spas to be closed till March 31st. Any gathering with more than 50 persons excluding weddings will not be allowed. For weddings also, we request if they can be postponed then please do so. pic.twitter.com/vGLPB3EL6D
— ANI (@ANI) March 16, 2020