మన్మోహన్ సింగ్ కోలుకోవాలని మోడీ, రాహుల్ ఆకాంక్ష

కరోనా సోకి సోమవారం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్​ సింగ్​ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ ఆకాంక్షించారు.

మన్మోహన్ సింగ్ కోలుకోవాలని మోడీ, రాహుల్ ఆకాంక్ష

Get Well Soon Messages Pour In For Dr Manmohan Singh Hospitalised With Covid

Updated On : April 19, 2021 / 11:40 PM IST

Manmohan Singh కరోనా సోకి సోమవారం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్​ సింగ్​ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. మన్మోహన్​ సింగ్​ త్వరగా కోలుకోవాలని,ఆయన ఆరోగ్యం బాగుండాలని మోడీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

మన్మోహన్​ సింగ్ త్వరగా కోలుకోవాలని,ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిలో ఉన్న దేశానికి ఆయన సలహాలు, సూచనలు అవసరమని కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక,పలు రాష్ట్రాల సీఎంలు,కేంద్రమంత్రులు, వివిధ పార్టీలకు చెందిన నేతలు,ప్రముఖులు మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ లు చేశారు. ఇక, నెటిజన్లు కూడా పెద్ద సంఖ్యలో సోషల్ మీడియా వేదికగా మన్మోహన్ సింగ్ కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. గెట్ వెల్ సూన్(త్వరగా కోలుకోవాలి)అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, మన్మోహన్ సింగ్ కరోనా వ్యాక్సిన్ “కోవాగ్జిన్” రెండు డోసులను తీసుకున్నాక కూడా ఆయనకు కరోనా సోకింది. కోవాగ్జిన్ మొదటి డోసు మార్చి 4 న మరియు రెండవ డోసు ఏప్రిల్ 3న మన్మోహన్ సింగ్ తీసుకున్నారు.